వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి
ABN , Publish Date - Jan 28 , 2025 | 12:29 AM
వ్యవసాయ బావిలో జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పరిగి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ బావిలో జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని నస్కల్ గ్రామానికి చెందిన రైతు ఉదాండ్ర సుభాన్(45) తన పొలం దగ్గర వేరుశనగ పంటను పందుల బెడద నుంచి రక్షించడానికి రాత్రి సమయంలో కాపలాకు వెళ్తుంటాడు. 25న శనివారం రాత్రి పొలానికి వెళతానని చెప్పి తిరిగిరాలేదు. బంధువుల దగ్గర ఆచూకీ కోసం వెతికినా లభించలేదు. సోమవారం గ్రామంలోని ఉదాండ్ర రాంచంద్రయ్య వ్యవసాయ బావి గడ్డపై రాజు అనే వ్యక్తికి చెప్పులు, బ్యాటరీలు కనిపించాయి. ఈవిషయంపై కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా వచ్చి బావిలో పరిశీలిస్తే సుభాన్ మృతదేహం లభించింది. అయితే సుభాన్ పావురాల కోసం వెళ్ళి జారిపడి మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్ తెలిపారు.