ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Feb 04 , 2025 | 12:01 AM
కుటుంబ కలహాల కారణంగా ఓవ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఘట్‌కేసర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఘట్‌కేసర్ రూరల్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాల కారణంగా ఓవ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఘట్‌కేసర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఘట్‌కేసర్‌కు చెందిన డేరంగుల శేఖర్(32) మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో శేఖర్ ఈనెల మొదటి తేదీన మద్యం మత్తులో తన సోదరులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు వెతకగా ఆదివారం రాత్రి స్థానిక చిన్నచెరువు సమీపంలో చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పరశురాం తెలిపారు.