Share News

బైక్‌ను ఢీకొన్న బస్సు

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:14 AM

మండల పరిధి చంద్రాయన్‌గూడ సమీపంలోని పాతజాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి బస్సు బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తిమృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు..

బైక్‌ను ఢీకొన్న బస్సు

ఒకరి మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

నందిగామ, జనవరి 3(ఆంధ్రజ్యోతి): మండల పరిధి చంద్రాయన్‌గూడ సమీపంలోని పాతజాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి బస్సు బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తిమృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. ఫరూఖ్‌నగర్‌ మండలం, పీర్లగూడకు చెందిన గుంటి నర్సింలు(50) అదే గ్రామానికి చెందిన సురేష్‌, క్రిష్ణయ్యలు ఓ ఫంక్షన్‌కు నందిగామ మండలం నర్సప్పగూడకు వచ్చారు. తిరిగి బైక్‌పై ముగ్గురు స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో నందిగామ మండలం చంద్రాయన్‌గూడ సమీపంలో పాతజాతీయ రహదారిపై హైదరాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనకాల నుంచి బైక్‌ను ఽఽఢీకొట్టింది. నర్సింలుకు తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్‌లో షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నర్సింలు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మిగతా ఇద్దరికచి గాయాలవ్వడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు లింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Jan 04 , 2025 | 12:14 AM