క్రీడలతో ఉజ్వల భవిష్యత్
ABN , Publish Date - Jan 19 , 2025 | 11:49 PM
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిషత్తు ఉంటుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నాగర్‌కుంట గ్రామంలో మల్లి మహేష్ తండ్రి జంగయ్య జ్ఞాపకార్థం క్రికెట్ పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి మొదటి బహుమతి షాబాద్ జట్టుకు రూ.10వేలు.. రెండో బహుమతి నాగర్‌కుంట జట్టుకు రూ. 5వేల నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు.
షాబాద్, జనవరి 19(ఆంధ్రజ్యోతి) : క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిషత్తు ఉంటుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నాగర్‌కుంట గ్రామంలో మల్లి మహేష్ తండ్రి జంగయ్య జ్ఞాపకార్థం క్రికెట్ పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి మొదటి బహుమతి షాబాద్ జట్టుకు రూ.10వేలు.. రెండో బహుమతి నాగర్‌కుంట జట్టుకు రూ. 5వేల నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు. గుడిమల్కాపూర్ ఏ ఎంసీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు సుభాష్‌రెడ్డి, కిషోర్‌నాయక్, దయాకర్, రఫీక్, రమేష్, వెంకటయ్య, సాయి, జలీల్, క్రీడాకారులు పాల్గొ న్నారు. అలాగే క్రీడలు మానసిక ఉల్లాసం, స్నేహబంధాన్ని పెంపొందిస్తాయని హైదరాబాద్ గ్రీన్ ఫార్మసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు తెలిపారు. కందుకూరు మండలం సాయిరెడ్డిగూడ గ్రామం లో గ్రామానికి చెందిన జి.రమేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కార్యదర్శి పంతునాయక్, మాజీ సర్పంచ్ బుక్క మహేష్, జి.రామకృష్ణ, సి.శ్రీనివాస్, కె.శ్రీను.ఎ.నరసింహ, కంద పెద్ద నర్సింహ, తదితరులున్నారు. నేదునూరులో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మాజీ వైఎస్ ఎంపీపీ జి.శమంతప్రభాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రామకృష్ణారెడ్డిలు బహుమతులు అందజేశారు. మాజీ ఉపసర్పంచ్ బి.శ్రీనివాస్, నాయకులు ఎండీ అఫ్జల్‌బేగ్, బి.సురేష్, ఎస్.వెంకటేష్, ఎ.కుమార్, వి.శ్రీరాములు, వి.బాబు, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.