Share News

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో 10 మందికి జైలు

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:00 AM

తాండూరు పట్టణ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన పది మందికి జైలుశిక్ష పడినట్లు సీఐ సంతోష్‌ కుమార్‌ తెలిపారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో 10 మందికి జైలు

తాండూరు, జనవరి 3(ఆంధ్రజ్యోతి): తాండూరు పట్టణ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన పది మందికి జైలుశిక్ష పడినట్లు సీఐ సంతోష్‌ కుమార్‌ తెలిపారు. తాండూరుకు చెందిన బాలకృష్ణయ్యకు మూడు రోజులు, కోట బాస్పల్లికి చెందిన వడ్డె మహేష్‌, హన్మాపూర్‌కు చె ందిన యాదగిరికి రెండు రోజులు జైలుశిక్ష విధించారు. రేగొండికి చెందిన రత్నం, కల్లూర్‌ పాండుగౌడ్‌, కర్సికలాన్‌కు చెందిన రాజుగౌడ్‌, తాండూరుకు చెందిన రియాజ్‌, సంజీవరెడ్డి, రామకృష్ణారెడ్డి, బెన్నూర్‌కు చెందిన నారాయణలకు ఒక రోజు జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. తోపుడు బండితో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న తాండూరు పట్టణానికి చెందిన మక్సుద్‌కు రూ.500జరిమానా, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపిన ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.2500 జరిమానా విధించినట్లు సీఐ ఈ సందర్భంగా వివరించారు.

Updated Date - Jan 04 , 2025 | 12:00 AM