Congress party: విస్తరణలో కాంగ్రెస్ సామాజిక న్యాయం పాటించింది
ABN , Publish Date - Jun 09 , 2025 | 04:46 AM
జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కాలనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంకల్పంలో భాగంగానే ఈసారి మంత్రివర్గ విస్తరణలో బడుగులకు పదవులు లభించాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ అన్నారు.
హైదరాబాద్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కాలనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంకల్పంలో భాగంగానే ఈసారి మంత్రివర్గ విస్తరణలో బడుగులకు పదవులు లభించాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. మూడు మంత్రి పదవులను ఎస్సీ, బీసీ వర్గాలకే కేటాయించడం హర్షణీయమన్నారు. ఇటీవల ఎమ్మెల్సీ పదవుల్లోనూ కాంగ్రెస్ సామాజిక న్యాయం పాటించిందని, అలాగే ఆ పార్టీలోని 66 ఉన్నత పదవుల్లో 40 పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిందని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామాజిక న్యాయం అమలు కోసం కృషి చేస్తున్న రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కు శ్రీనివా్‌సగౌడ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట
For Telangana News And Telugu News