Share News

Auto Drivers: ఆటో డ్రైవర్లకు ఈఎస్‌‌ఐ అమలు చేయాలి:జేఏసీ

ABN , Publish Date - Jun 18 , 2025 | 04:18 AM

ఆటో, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లకు తక్షణం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఈఎ్‌సఐ, పీఎఫ్‌ అమలు చేయాలని తెలంగాణ ఆటో అండ్‌ ప్రైవేటు ట్రాన్స్‌ పోర్టు యూనియన్‌ జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Auto Drivers: ఆటో డ్రైవర్లకు ఈఎస్‌‌ఐ అమలు చేయాలి:జేఏసీ

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఆటో, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లకు తక్షణం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఈఎ్‌సఐ, పీఎఫ్‌ అమలు చేయాలని తెలంగాణ ఆటో అండ్‌ ప్రైవేటు ట్రాన్స్‌ పోర్టు యూనియన్‌ జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హైదర్‌గూడలో యూనియన్‌ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ రవిశంకర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఉన్న ఆటోలకు గిరాకీ లేక ఇబ్బందులు పడుతుంటే కొత్త ఆటోలకు పర్మిట్లు ఇచ్చి అక్రమ దందాకు తెరలేపిందని విమర్శించారు.


ముందు, ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 18 , 2025 | 04:18 AM