తేజేశ్వర్ హత్య కేసులో.. తిరుమల్‌రావు అరెస్టు!
ABN , Publish Date - Jun 26 , 2025 | 04:59 AM
గు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్యకేసులో ప్రధాన నిందితుడు, బ్యాంకు ఉద్యోగి తిరుమల్‌రావు పోలీసులకు చిక్కినట్టు తెలిసింది.
గద్వాల క్రైం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్యకేసులో ప్రధాన నిందితుడు, బ్యాంకు ఉద్యోగి తిరుమల్‌రావు పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. ఏపీలోని కడప జిల్లాలో ఆయనను అదుపులోకి తీసుకుని, గద్వాలకు తరలించినట్టు సమాచారం. గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్‌లో తిరుమల్‌రావును విచారించినట్టు తెలిసింది.
మరోవైపు హత్యకు సంబంధించి పలు అంశాలపై తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతతోపాటు తిరుమల్‌రావు భార్యను కూడా మంగళవారమే పట్టణ పోలీస్ స్టేషన్‌లో విచారించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ హత్యోదంతం వివరాలన్నీ గురువారం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.