Share News

PM Modi: ఉత్తమ పంచాయతీగా మాల్‌

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:16 AM

ప్రధాని మోదీ చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా మాల్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి వైవీ రాజు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును అందుకున్నారు.

PM Modi: ఉత్తమ పంచాయతీగా మాల్‌

  • ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న పంచాయతీ కార్యదర్శి

యాచారం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా మాల్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి వైవీ రాజు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును అందుకున్నారు. బిహార్‌లోని మదుబన్‌ నగరంలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం కింద ఎంపికైన ఉత్తమ గ్రామా ల కార్యదర్శులకు అవార్డులను ప్రదానం చేశారు. అవార్డుతో పాటు కోటి రూపాయల నగదు బహుమతి గ్రామానికి అందనుంది.


గత నెలలో కేంద్ర బృందం గ్రామంలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించింది. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్న అధికారులను అభినందింది, గ్రామాన్ని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. మాల్‌ గ్రామానికి అవార్డు రావడం తమపై మరింత బాధ్యతను పెంచిందని ఎంపీడీవో జి.నరేందర్‌రెడ్డి, ఎంపీవో శ్రీలత, పంచాయతీ కార్యదర్శి రాజు అన్నారు. వీరి వెంట డీఎల్‌పీవో సాధన ఉన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 04:16 AM