Share News

Train Crime: రైలులో గర్భిణిపై అత్యాచారయత్నం

ABN , Publish Date - Feb 08 , 2025 | 02:46 AM

ఆమె ప్రతిఘటించి పెద్దగా కేకలు వేయడంతో.. ఆమెపై దాడి చేసి కదిలే రైలు నుంచి కిందకి తోసేశాడు. ఈ ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన మహిళ తీవ్రంగా గాయపడి, వేలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, లైంగిక దాడికి ప్రయత్నించిన తమిళనాడుకు చెందిన హే మరాజ్‌ను జోలార్‌పేట రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.

Train Crime: రైలులో గర్భిణిపై అత్యాచారయత్నం

ప్రతిఘటించడంతో కదిలే రైలు నుంచి తోసివేత

చిత్తూరు జిల్లా యువతికి తీవ్ర గాయాలు

తమిళనాడుకు చెందిన నిందితుడి అరెస్టు

చెన్నై, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): రైలు బోగీలో ఒంటరిగా ఉన్న గర్భిణిపై అత్యాచారానికి ప్రయత్నించాడో యువకుడు. తాను గర్భిణినని, వదలిపెట్టాలని వేడుకున్నా వినిపించుకోకుండా లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించి పెద్దగా కేకలు వేయడంతో.. ఆమెపై దాడి చేసి కదిలే రైలు నుంచి కిందకి తోసేశాడు. ఈ ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన మహిళ తీవ్రంగా గాయపడి, వేలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, లైంగిక దాడికి ప్రయత్నించిన తమిళనాడుకు చెందిన హే మరాజ్‌ను జోలార్‌పేట రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడులోని తిరుప్పూరుకు చెందిన జమిన జోసెఫ్‌ భార్య నాలుగు నెలల గర్భవతి. చిత్తూరు సమీపంలోని మంగసముద్రం ఆమె పుట్టినిల్లు. గురువారం ఆ యువతి (36) కోయంబత్తూరు-తిరుపతి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రె్‌సలో పుట్టింటికి బయల్దేరింది.

వేకువజామున తిరుప్పూరులో మహిళా బోగీ ఎక్కగా.. అందులో ఉన్న మరో నలుగురైదుగురు మహిళలు జోలార్‌పేట స్టేషన్‌ వచ్చేసరికి దిగిపోయారు. వేలూరు జిల్లా కేవీ కుప్పంకు చెందిన హేమరాజ్‌(28) జోలార్‌పేటలో మ హిళా బోగీ ఎక్కాడు. అక్కడ గర్భిణి ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. తీవ్రంగా ప్రతిఘటించిన ఆమె పెద్దగా కేకలు వేయడంతో.. ఆమె జట్టుపట్టుకుని తీవ్రంగా దాడిచేశాడు. అనంతరం ఆమెను కదిలే రైలు నుంచి బయటకు తోసేశాడు. ఈ ఘ టనలో ఆమె కాళ్లు, చేతులు, తలకు బలమైన గాయాలయ్యాయి. రైలు పట్టాల పక్కన అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను రైల్వే సిబ్బంది గమనించి.. ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు జోలార్‌పేట స్టేషన్‌లో సీసీ కెమెరాల ఆధారంగా హేమరాజ్‌ను గుర్తించి.. శుక్రవారం ఉదయం అతడిని కేవీ కుప్పంలో అరెస్టు చేశారు. హేమరాజ్‌ ఓ యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 08 , 2025 | 02:46 AM