Share News

Pinapaka: జెడ్డీ కట్టి.. గర్భిణిని 3 కి.మీ మోసుకెళ్లి

ABN , Publish Date - Jun 09 , 2025 | 04:35 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టి కొత్తగూడెం పంచాయతీ పరిధిలోని ఉమేశ్‌ చంద్ర నగర్‌లో ఆదివారం ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడ్డారు.

Pinapaka: జెడ్డీ కట్టి.. గర్భిణిని 3 కి.మీ మోసుకెళ్లి

రోడ్డు మార్గం లేక భద్రాద్రి అటవీ గ్రామాల్లో కష్టాలు

పినపాక, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): అటవీ గ్రామాల్లో సరైన రోడ్డు మార్గాలు లేకపోవడంతో గర్భిణులకు కష్టాలు తప్పడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టి కొత్తగూడెం పంచాయతీ పరిధిలోని ఉమేశ్‌ చంద్ర నగర్‌లో ఆదివారం ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడ్డారు. వలస ఆదివాసీ గ్రామానికి చెందిన గర్భిణి జానకికి ఆదివారం పురిటి నొప్పులు రావడంతో భర్త సమ్మయ్య 108 అంబులెన్స్‌కు సమాచారం అందించాడు. అయితే గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 108వాహనం మూడు కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయింది. దాంతో కుటుంబ సభ్యులు గర్భిణిని జెడ్డీ కట్టి మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచి మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించిన తర్వాత ఆమె రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే జానకిని మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

For Telangana News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 04:35 AM