Share News

శ్రీవారికి 50కిలోల వెండి అఖండ దీపాలు

ABN , Publish Date - May 20 , 2025 | 04:53 AM

తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండ దీపాలను సోమవారం విరాళంగా అందజేశారు.

శ్రీవారికి 50కిలోల వెండి అఖండ దీపాలు

  • విరాళంగా అందజేసిన మైసూరు రాజమాత

తిరుమల, మే19(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండ దీపాలను సోమవారం విరాళంగా అందజేశారు. 300 ఏళ్ల కిందట అప్పటి మైసూరు మహారాజు స్వామికి సమర్పించిన అఖండదీపాలు పాడైపోవడంతో, వాటి స్థానంలో 50 కిలోల బరువుండే వెండి దీపాలను టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో అందజేశారు.


దర్శనం అనంతరం ప్రమోదాదేవితోపాటు యదువర్‌ కృష్ణదత్త చామరాజు ఒడయార్‌ ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ ఆలయ అధికారులు నాలుగు నెలల కిందట మైసూరు ప్యాలె్‌సకు వచ్చి పాత అఖండదీపాలు పాడైపోయిన విషయం చెప్పారన్నారు. స్వామికి సేవ చేసుకోవడంలో భాగంగా తమ పూర్వీకుల ఆచారాన్ని కొనసాగించడానికి ఈ దీపాలను తిరిగి అందించామని చెప్పారు.

Updated Date - May 20 , 2025 | 04:53 AM