Bhadrachalam : భద్రాచలం రామాలయంలో సంప్రోక్షణ.. ఉదయం 7.30 నుంచి స్వామి వారి దర్శనం
ABN , Publish Date - Sep 08 , 2025 | 06:49 AM
చంద్ర గ్రహణం సందర్భంగా భద్రాచలం రామాలయంలో గ్రహణానంతర సంప్రోక్షణ జరిగింది. అనంతరం నేటి ఉదయం 7.30 నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతి ఏర్పాట్లు చేశారు. ఈ తెల్లవారు ఝామున మూడు గంటలకు ఆలయాన్ని తెరచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ..
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 8 : చంద్ర గ్రహణం సందర్భంగా భద్రాచలం రామాలయంలో గ్రహణానంతర సంప్రోక్షణ జరిగింది. అనంతరం నేటి ఉదయం 7.30 నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతి ఏర్పాట్లు చేశారు. ఈ తెల్లవారు ఝామున మూడు గంటలకు ఆలయాన్ని తెరచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ, సుప్రభాతం ఆరాధన సేవ, నివేదన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం తెలంగాణలో గోదావరి నది తీరంలో ఉన్న పవిత్ర క్షేత్రం. ఈ ఆలయాన్ని దక్షిణ ఆయోధ్యగా పిలుస్తారు. రాముడు, సీతమ్మ, లక్ష్మణుడి విగ్రహాలు ఇక్కడ ప్రధాన దేవతలు. 17వ శతాబ్దంలో భక్త రామదాసు (కంచర్ల గోపన్న) ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రతి రోజూ వేలాది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఈ ఆలయానికి వస్తారు. ముఖ్యంగా శ్రీరామ నవమి, వైకుంఠ ఏకాదశి వంటి పండుగల్లో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది.
ఆలయం ప్రతి రోజూ ఉదయం 4:00 గంటలకు తెరుస్తారు. రాత్రి 9:30 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. సాధారణ దర్శనం (సర్వ దర్శనం) ఉచితం. మధ్యాహ్నం 12:00 నుంచి 3:00 గంటల వరకు ఆలయం మూసివేస్తారు. ఆ తర్వాత మళ్లీ తెరుస్తారు. ఉదయం 7:30 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది. ఈ అంతరాలయ ఆర్చన సేవలో భక్తులు స్వామివారిని దగ్గరనుంచి దర్శించుకోవచ్చు. ఈ సేవ రూ. రూ. 300 కు లభిస్తుంది. ఒక్కరు లేదా జంటకు అనుమతిస్తారు. ఉదయం 7:30 నుంచి 8:00 గంటల వరకు ఈ ఆర్చన జరుగుతుంది. దీని తర్వాత సాధారణ దర్శనం కొనసాగుతుంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి