Share News

Ponnam Prabhakar: సర్వేలో పాల్గొనని కేసీఆర్‌కు.. అడిగే హక్కు ఎక్కడిది?

ABN , Publish Date - Feb 08 , 2025 | 03:20 AM

బీసీలకు కనీసం న్యాయం చేయాలనే ఆలోచన కూడా వారికి లేదన్నారు. సర్వేపై అసెంబ్లీలో చర్చకు బీఆర్‌ఎస్‌ సిద్ధమా? అని ప్రశ్నించారు. బీసీల జనాభా 56శాతం అని తేలిందని.. బీఆర్‌ఎస్‌ పార్టీనేమో 51శాతం అని చెబుతోందని ఈ విషయమ్మీద అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధం అని చెప్పారు.

Ponnam Prabhakar: సర్వేలో పాల్గొనని కేసీఆర్‌కు.. అడిగే హక్కు ఎక్కడిది?

బలహీన వర్గాల గురించి ఆయన మాట్లాడడమా..

అప్పట్లో సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్‌ ఇంటికే పరిమితం

కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌కు పార్టీ పదవులు.. బీసీలకు ఒక్కటైనా ఇచ్చారా?

బీసీని సీఎం చేస్తానన్న బీజేపీ... సభాపక్ష పదవిని రెడ్డికి ఇచ్చింది: పొన్నం

ఫాంహౌ్‌సలో ఉండేవాళ్లకు రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు లేదు: కోమటిరెడ్డి

సిద్దిపేట, భీమదేవరపల్లి, యాదాద్రి, హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): సమగ్ర కులగణన సర్వేలో భాగస్వామి కాని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులకు బలహీన వర్గాల గురించి మాట్లాడే హక్కు లేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బీసీలకు కనీసం న్యాయం చేయాలనే ఆలోచన కూడా వారికి లేదన్నారు. సర్వేపై అసెంబ్లీలో చర్చకు బీఆర్‌ఎస్‌ సిద్ధమా? అని ప్రశ్నించారు. బీసీల జనాభా 56శాతం అని తేలిందని.. బీఆర్‌ఎస్‌ పార్టీనేమో 51శాతం అని చెబుతోందని ఈ విషయమ్మీద అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధం అని చెప్పారు. బీసీ నేత అయినందునే ఈటల రాజేందర్‌ను బీఆర్‌ఎస్‌ గెంటేసిందని విమర్శించారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో, హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో జరిగిన కార్యక్రమాలకు హాజరై మాట్లాడారు. అప్పట్లో బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబసర్వే కేసీఆర్‌ ఇంటికే పరిమితమైందన్నారు. సీఎంగా కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌, శాసనసభా పక్షనేతగా హరీశ్‌రావు పదవులు అనుభవించారని..


ఆ పార్టీ నుంచి బీసీలకు ఒక్క పదవైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. బీసీలకు న్యాయం చేయని బీఆర్‌ఎస్‌ నేతలు ఏ హక్కుతో బీసీల గురించి మాట్లాడతారని నిలదీశారు. తాము అధికారంలోకి వస్తే.. బీసీని సీఎం చేస్తామని బీజేపీ ఎన్నికల్లో చెప్పిందని.. అయితే ఆ పార్టీ శాసనసభా పక్ష పదవిని ఓ రెడ్డికి ఇచ్చారని, బీసీల గురించి మాట్లాడే హక్కు కమలం నేతలకు ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. బీసీలను తక్కువ సంఖ్యలో చూపిస్తే ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనం ఏమిటి? అనేది బీసీ మేధావులు, నాయకులు ఆలోచించాలని కోరారు. కాగా కులగణనలో పాల్గొనకుండా ఫౌమ్‌హౌ్‌సలో ఉన్న వాళ్లకు సర్వేలో లోపాలు, రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము బీఆర్‌ఎస్‌ హయాంలో మాదిరిగా హడావుడిగా సర్వే చేయలేదని, తాము చేసిన సర్వేను ప్రజల ముందు పెట్టామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో 12గంటలపాటు దొంగ కుటుంబసర్వే చేసి.. 51శాతం బీసీలున్నారని తేల్చారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పరంగా 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామన్నారు. కాగా ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నకు క్రమశిక్షణ సంఘం నోటీసు ఇవ్వడంపై మంత్రిని ప్రశ్నించగా ఆయన విషయంలో తనకు మాట్లాడేంత సమయం లేదని, మాట్లాడటం కూడా వృథా అన్నారు. మరోవైపు.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో చేపట్టిన సమగ్ర కుల సర్వే-2024పై వెల్లువెత్తిన అభ్యంతరాలపై బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ స్పందించారు. 3,56,323 ఇళ్లలో సర్వేనే నిర్వహించలేదని, ఆ కారణంగా గ్రేటర్‌ పరిధిలో బీసీల జనాభా తగ్గినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సర్వే చేసిన ఇళ్లు, చేయని ఇళ్ల వివరాలు.. ఎన్యుమరేటర్ల వివరాలను వారం రోజుల్లో అందించచాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.


ప్రభుత్వం ఒత్తిడిలో నివేదిక ఇస్తే అసలుకే మోసం: వకుళాభరణం

రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో సమగ్ర అధ్యయనం చేయకుండా డెడికేటెడ్‌ కమిషన్‌ హడావుడిగా నివేదిక సమర్పిస్తే గనక అసలుకే మోసం జరిగే ప్రమాదం ఉందని తెలంగాణ బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు త్వరగా ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో నివేదిక కోసం డెడికేటెడ్‌ కమిషన్‌పై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సామాజిక ఆర్థిక కుల సర్వే వివరాల్లో బీసీలతో పాటుగా ఎస్సీ, ఎస్టీల జనాభా తగ్గిందనే ఆరోపణల నేఽపధ్యంలో డెడికేటెడ్‌ కమిషన్‌ సమగ్ర విశ్లేషణలు, అధ్యయనాలతో నివేదిక రూపొందించాలని సూచించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ప్రామాణిక పద్థతులు పాటించకుండా ప్రభుత్వం ఇచ్చే జనాభా లెక్కలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక న్యాయస్థానాల్లో వీగిపోయే ప్రమాదం లేకపోలేదన్నారు.


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 08 , 2025 | 03:20 AM