Share News

Ponnam Prabhakar: ఘోష్‌ కమిషన్‌ నివేదికపై సభలో చర్చిస్తాం: పొన్నం

ABN , Publish Date - Aug 30 , 2025 | 02:26 AM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యం చూపడంతో తప్పిదాలు జరిగాయని ఘోష్‌

Ponnam Prabhakar: ఘోష్‌ కమిషన్‌ నివేదికపై సభలో చర్చిస్తాం: పొన్నం

కరీంనగర్‌ అర్బన్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యం చూపడంతో తప్పిదాలు జరిగాయని ఘోష్‌ కమిషన్‌ తన నివేదికలో స్పష్టంగా పేర్కొందని, నివేదికపై శాసనసభలో చర్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. శుక్రవారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఘోష్‌ కమిషన్‌ నివేదికపై సభలో బీఆర్‌ఎస్‌ నాయకులు తమ వాదనలు వినిపించాలన్నారు.


కాళేశ్వరంపై కోర్టుకు వెళ్లి అరెస్టు కాకుండా అడ్డుకోవడం, ఇతర ప్రయత్నాలు జరుగుతున్నాయంటే వారు ఎటువంటి ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నారో అర్థమవుతోందన్నారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ నాయకులను తప్పించేందుకే బీజేపీ సీబీఐ విచారణ కోరుతోందని ఆయన ఆరోపించారు.

Updated Date - Aug 30 , 2025 | 02:26 AM