Share News

Pongileti: వడ్డీలు చెల్లిస్తూ సంక్షేమ పథకాల అమలు

ABN , Publish Date - Jul 01 , 2025 | 04:53 AM

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన రూ.8లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు.

Pongileti: వడ్డీలు చెల్లిస్తూ సంక్షేమ పథకాల అమలు

  • ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌: పొంగులేటి

  • వరంగల్‌ జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రాయపర్తి, హైదరాబాద్‌, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన రూ.8లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్‌దేనన్నారు. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో రూ.14.17 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 20వేల మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యం గల గోదాం పనులను వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, పాలకుర్తి, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు యశస్వినిరెడ్డి, నాగరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. భూ భారతి చట్టంతో సమస్యలన్నీ తీరుస్తామన్నారు.


ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. బీఆర్‌ఎ్‌సను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఎన్నిక ఏదైనా కాంగ్రె్‌సదే గెలుపని పొంగులేటి చెప్పారు. కాగా, నిరుపేదలకు గృహవసతి కల్పనలో దేశంలోనే తెలంగాణ తలమానికంగా నిలిచిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్న తమ ప్రభుత్వం ఇప్పటికే 3 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వాటిలో 1.23 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందన్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణంతో రాష్ట్రంలో గుడిసెల్లేకుండా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న పొంగులేటి.. సీఎం ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి 40 మెట్రిక్‌ టన్నుల ఇసుక ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Jul 01 , 2025 | 04:53 AM