Share News

KBR Park: సబిత కుమారుడి వాహనంపై 26 వేల పెండింగ్‌ చలానాలు

ABN , Publish Date - Feb 08 , 2025 | 03:12 AM

ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీ చేశారు. ఇదే సమయంలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి రెండవ కుమారుడు కౌశిక్‌రెడ్డి కారు వచ్చింది. వాహనం నెంబర్‌ ఆధారంగా పరిశీలించగా 28 పెండింగ్‌ చలానాల్లో భాగంగా 26 వేల రూపాయలు బకాయి ఉన్నట్టు తేలింది.

KBR Park: సబిత కుమారుడి వాహనంపై 26 వేల పెండింగ్‌ చలానాలు

ట్రాఫిక్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలి

ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ విశ్వప్రసాద్‌

బంజారాహిల్స్‌, ఫిబ్రవరి 7 (ఆంరధజ్యోతి): బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్కు వద్ద శుక్రవారం పశ్చిమ మండలం ట్రాఫిక్‌ పోలీసులు బ్లాక్‌ ఫిలిం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీ చేశారు. ఇదే సమయంలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి రెండవ కుమారుడు కౌశిక్‌రెడ్డి కారు వచ్చింది. వాహనం నెంబర్‌ ఆధారంగా పరిశీలించగా 28 పెండింగ్‌ చలానాల్లో భాగంగా 26 వేల రూపాయలు బకాయి ఉన్నట్టు తేలింది. వెంటనే బకాయి చెల్లించాలని పోలీసులు సూచించారు. అనంతరం కారుకు ఉన్న బ్లాక్‌ ఫిలింను తొలగించారు. అలాగే చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి వాహనం రాగా.. దాన్ని పరిశీలించగా 9 చలానాల్లో భాగంగా 3145 రూపాయల బకాయి ఉన్నట్టు తేలింది. ఈ సందర్భంగా నగర ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ..ట్రాఫిక్‌ నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని సూచించారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనల విషయంలో ఏ ఒక్కరిని వదిలేది లేదని స్పష్టం చేశారు. పెద్ద హారన్‌లు, కనిపించని నెంబర్‌ ప్లేట్‌లు, బ్లాక్‌ ఫిలిం ఇలా ప్రతి అంశంపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాహుల్‌ హెగ్డే, ఏసీపీ కట్టా హరిప్రసాద్‌ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 08 , 2025 | 03:12 AM