Share News

PM Modi: కిషన్‌రెడ్డికి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

ABN , Publish Date - Jun 16 , 2025 | 04:05 AM

కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డికి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సామాన్య కార్యకర్త నుంచి ఎదిగిన మీరు ఆత్మనిర్భర భారత్‌ కోసం..

PM Modi: కిషన్‌రెడ్డికి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డికి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సామాన్య కార్యకర్త నుంచి ఎదిగిన మీరు ఆత్మనిర్భర భారత్‌ కోసం దేశ బొగ్గు, గనుల రంగాలను బలోపేతం చేయడంలో ముందంజలో ఉన్నారు. మీరు ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను’’ అని ప్రధాని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.


మోదీకి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ.. వికసిత్‌ భారత్‌ కలను సాకారం చేసేందుకు తన వంతు ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ నిరంతర ప్రోత్సాహం స్ఫూర్తినిస్తుందన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 04:05 AM