Share News

Asaduddin Owaisi: పీవోకేను స్వాధీనం చేసుకోవాలి

ABN , Publish Date - May 02 , 2025 | 04:31 AM

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవాలని ప్రధాని మోదీని సూచించారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉగ్రవాదుల స్థావరాలు 2019లో ఎందుకు నిరోధించలేదని ఒవైసీ విమర్శించారు.

Asaduddin Owaisi: పీవోకేను స్వాధీనం చేసుకోవాలి

ఈసారి వదిలిపెట్టకూడదు: ఒవైసీ

హైదరాబాద్‌, మే 1: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)ను స్వాధీనం చేసుకోవాలని, ఈసారి మాత్రం వదిలిపెట్టకూడదని మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మోదీ ప్రభుత్వానికి సూచించారు. ఉగ్రవాదులను ‘ఇంట్లోకి చొరబడి చంపుతామ’న్న ప్రధాని మోదీ గత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘ఈసారి ఇంట్లోకి చొరబడి అక్కడే ఉండాల’ని వ్యాఖ్యానించారు. గురువారం ఒవైసీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాక్‌ సైనికులు పోస్టులను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారన్న వార్తలపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘అదే నిజమైతే చాలా మంచిది. మనం వెళ్లి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాల’ని సూచించారు. మోదీ ప్రభుత్వం ఎల్‌వోసీ వెంబడి ఉగ్రవాదుల స్థావరాలను 2019లోనే నిర్మూలించకపోవడాన్ని ఒవైసీ విమర్శించారు. పీవోకే మనదేనని పార్లమెంటు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఈసారి కేంద్ర ప్రభుత్వం గట్టి చర్య తీసుకోవాలని సూచించారు.


ఇవి కూడా చదవండి

ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం

PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 04:31 AM