Telangana Land Law: భూ భారతికి రూపం..!
ABN , Publish Date - Mar 04 , 2025 | 05:06 AM
ఇప్పటికే విధివిధానాల ముసాయిదా సిద్ధమైన నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లో అవసరమైన ఫార్మెట్‌లను జత చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించనున్నారు.
ఫార్మెట్స్ తయారీలో అధికారులు
సీఎంకు రెండు రోజుల్లో విధివిధానాల ముసాయిదా
హైదరాబాద్, మార్చి3(ఆంధ్రజ్యోతి): లోపాలకు తావు లేకుండా భూభారతి చట్టంలో పేర్కొన్న ప్రతి విషయంపైనా పూర్తి స్పష్టత ఇస్తూ ఫార్మెట్‌లను తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే విధివిధానాల ముసాయిదా సిద్ధమైన నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లో అవసరమైన ఫార్మెట్‌లను జత చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించనున్నారు. ఆబాదీ భూముల సర్వే, మ్యాప్‌ల తయారీ వంటి విషయాలపై ప్రస్తుతానికి నిబంధనలు రూపొందించే అవకాశం లేదు. అలాగే నిబంధనల అమలుకు సాఫ్ట్‌వేర్ కూడా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. నిబంధనల అమల్లో ఏకరూపతను తీసుకొచ్చేలా ఫార్మెట్స్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. నోటీసు ఇవ్వాలంటే ఏ తరహా ఫార్మేట్ ఉండాలి. సవరణలకు, రైతు వివరాలను రికార్డుల్లోకి ఎక్కించడానికి ఫార్మెట్ ఎలా ఉండాలనే అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు. సాదా బైనామా, ఆర్వోఆర్ సవరణలు, మ్యుటేషన్, గ్రామ రికార్డులు ఈ నాలుగు అంశాలపైనే ప్రస్తుతం ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. వీటిపై ప్రభుత్వం రెవెన్యూ నిపుణులు, న్యాయనిపుణులతో చర్చించాక చట్టం అమలుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..
Also Read: ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు
Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్
For Telangana News And Telugu News..