Official Caught Accepting Bribe: షోకాజ్ రద్దుకు రూ.25 వేల లంచం
ABN , Publish Date - Aug 26 , 2025 | 04:25 AM
ఫర్టిలైజర్ షాపుకు జారీ చేసిన షోకాజు నోటీసు రద్దు చేయడానికి దాని యజమాని నుంచి రూ.25 వేల లంచం తీసుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయశాఖ సహాయ డైరెక్టర్...
రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన ఏడీఏ
చుంచుపల్లి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ఫర్టిలైజర్ షాపుకు జారీ చేసిన షోకాజు నోటీసు రద్దు చేయడానికి దాని యజమాని నుంచి రూ.25 వేల లంచం తీసుకుంటూ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా వ్యవసాయశాఖ సహాయ డైరెక్టర్ (ఏడీఏ) నర్సింహరావు సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. యూరియా అమ్మకాలకు అనుమతుల్లేవని జిల్లాలోని లక్ష్మిదేవిపల్లి మండలంలోని ఒక ఫెర్టిలైజర్ షాప్ యజమానికి ఆయన ఈ నెల 23న షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆ నోటీసు రద్దు చేయడానికి రూ.50 వేలు లంచమడిగిన ఏడీఏకు రూ.25 వేలు ఇవ్వడానికి షాప్ యజమాని ఒప్పందం కుదుర్చుకున్నాడు. తర్వాత ఈ విషయమై ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారి సూచన మేరకు సోమవారం ఏడీఏ కార్యాలయంలోనే నర్సింహరావుకు రూ.25 వేలు ఇస్తుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు.. ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News