Share News

OMC verdict: 15 ఏళ్ల తర్వాత సీబీఐ కోర్టు సంచలన తీర్పు

ABN , Publish Date - May 06 , 2025 | 04:07 PM

OMC verdict: ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీవీ శ్రీనివాస్ రెడ్డి, ఏ2 గాలి జనార్ధన్ రెడ్డికి నాంపల్లిలోని సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది.

OMC verdict: 15 ఏళ్ల తర్వాత సీబీఐ కోర్టు సంచలన తీర్పు
OMC verdict

హైదరాబాద్, మే 6: ఓబుళాపురం మైనింగ్ కేసులో (Obulapuram mining case) సీబీఐ కోర్టు (CBI) సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీవీ శ్రీనివాస్ రెడ్డి, ఏ2 గాలి జనార్ధన్ రెడ్డికి నాంపల్లిలోని సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా సీబీఐ కోర్టు తేల్చేసింది. సబితతోపాటు ఏ8 కృపానందంను కూడా న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో శ్రీనివాసరెడ్డి, గాలి జనార్ధన్‌ రెడ్డితో పాటు ఏ3 వీ.డీ రాజగోపాల్, ఏ4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఏ7 అలీ ఖాన్‌లకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఓఎంసీ కేసులో కేసులో గాలి సోదరుడు బీవీ శ్రీనివాస్ రెడ్డి, గాలి జనార్దన్‌ రెడ్డికి కోర్టు ఏడేళ్ల శిక్ష విధించింది.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి ఈరోజు (మంగళవారం) సీబీఐ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఐదు మంది నిందితులను ఇప్పటికే దోషులుగా తేల్చుతూ వారికి శిక్షలు కూడా ఖరారు చేసింది కోర్టు. ఏ1 శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఏ2 మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి కూడా ఏడు సంవత్సరాల పాటు శిక్షను ఖరారు చేసింది న్యాయస్థానం. ఈ కేసులో ఇద్దరు నిందితులుగా ఉన్న మాజీ మంత్రి సబిత, ఐఏఎస్ కృపానందంను నిర్దోషిగా ప్రకటిస్తూ సీబీఐ కోర్టు కీలకమైన తీర్పును వెల్లడించింది. దాదాపు 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత నాలుగు చార్జ్‌షీట్లను ఇప్పటికే సీబీఐ కోర్టు ముందు సీబీఐ అధికారులు సమర్పించారు. 15 ఏళ్ల పాటు విచారణ అనంతరం సీబీఐ కోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ఏ1, ఏ2లకు ఏడేళ్ల పాటు శిక్షలు ఖరారు అయ్యాయి. అలాగే మిగిలిన దోషులకు కూడా కోర్టు ఏడేళ్ల శిక్ష విధించింది కోర్టు.


ఈ కేసులో ఐపీసీ 120బి రెడ్ విత్ 420, 409, 468, 471లతో పాటు కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (2) రెడ్ విత్ 13 (1)(డి)కింద సీబీఐ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో చాలా మంది సాక్షులను విచారించారు. సాక్షులు ఇచ్చిన స్టేట్‌మెంట్లను ఆధారంగా చేసుకుని సీబీఐ విచారణలో అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈరోజు సీబీఐ కోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది.


ఓబులాపురం అక్రమ మైనింగ్‌పై 2009, డిసెంబర్ 7న సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. 2011లో మొదటి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. మొదటి ఛార్జ్‌షీట్‌లోనే ఏ1, ఏ2లుగా ఉన్న గాలి జానార్దన్‌ రెడ్డి, ఆయన సోదరుడు శ్రీనివాస్‌ రెడ్డి కలిసి అక్రమంగా ఓబులాపురం మైనింగ్స్‌ను తవ్వి వాటిని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు. దీని ద్వారా దాదాపు రూ.844 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని ఆ ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చారు. ఈ కేసులో దాదాపు 219 మంది సాక్షులను న్యాయస్థానం ముందు ఉంచి వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. వారి ఇచ్చిన స్టేట్‌మెంట్లను ఆధారంగా చేసుకుని ఈకేసులో చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి.


మరోవైపు డాక్యుమెంట్ ఎవిడేషన్‌ను కూడా న్యాయస్థానం ముందు పెట్టింది సీబీఐ. డాక్యుమెంట్ ఎవిడేషన్ కింది దాదాపు 3337 డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచింది. సాక్షుల స్టేట్‌మెంట్లు, డాక్యుమెంట్లను వెరిఫై చేసిన తర్వాత న్యాయస్థానం దోషులకు శిక్షను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటి ప్రభుత్వంలో గనుశాఖమంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి మాత్రమే ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ కాలేదు. ఈ కేసులో మిగిలిన నిందితులంతా కూడా అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ఈ కేసులో సబిత డిశ్చార్జ్ పిటిషన్‌ వేసినప్పటికీ కూడా ఈకేసులో ఈమె పాత్ర కీలకమని గతంలో డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేసింది కోర్టు. అయితే ఈకేసులో సబిత, కృపానందరం పాత్ర లేదని, వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలను లేనందున వారిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.


ఇవి కూడా చదవండి

Supreme Court Richest Judge: సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లో సూపర్‌ రిచ్ ఎవరో తెలుసా

AP Govt: మాతృత్వ సెలవులు ఇక 180 రోజులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 06 , 2025 | 07:03 PM