Numaish Exhibition 2026: జనవరి 1 నుంచి నుమాయిష్ ఎగ్జిబిషన్..
ABN , Publish Date - Dec 28 , 2025 | 09:03 PM
మరికొద్ది రోజుల్లో నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్-2026 నిర్వహించనున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 28: మరికొద్ది రోజుల్లో నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్-2026 నిర్వహించనున్నారు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయాన్ని ఆదివారం నాడు వెల్లడించారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన శ్రీధర్ బాబు.. ఇప్పుడు నిర్వహించబోయే ఎగ్జిబిషన్ 85వ పారిశ్రామిక ప్రదర్శనగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సుమారు 1050 మంది ఎగ్జిబిటర్లు, 1,500 స్టాల్స్‌తో ఎంఎస్ఎంఈ, తయారీ, రిటైల్ రంగాలతో పాటు కళాకారులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌లో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. మెట్రో కనెక్టివిటీ, ఉచిత పార్కింగ్, వీల్‌చైర్ల సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. అగ్నిమాపక, పోలీస్, విద్యుత్ శాఖల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, గత ఏడాదికంటే ఎక్కువ మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉందన్నారు.