Note For Vote Case: సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఓటుకు నోటు కేసులో మత్తయ్యకు ఊరట..
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:16 AM
జరూసలేం మత్తయ్యపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు గతంలో క్వాష్ చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసు వ్యవహారంలో జరూసలేం మత్తయ్యకు ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. జరూసలేం మత్తయ్యపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు గతంలో క్వాష్ చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు నిర్ణయాన్ని సమర్ధించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టిపారేసింది.
2016లో సుప్రీంకోర్టులో పిటిషన్
ఓటుకు నోటు కేసుకు సంబంధించి జరూసలేం మత్తయ్యపై 2016లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ఈ ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏసీబీ 2016 జులై 6వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి వాదనలు వినిపించారు. ఈ కేసులో ఏ2గా ఉన్న సెబాస్టియన్, ఏ4 మత్తయ్యలు దాదాపుగా ఇరవై సార్లు ఫోన్లలో సంభాషించుకున్నారని కోర్టుకు తెలిపారు.
దానిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఏంతైనా ఉందని అన్నారు. మత్తయ్యను విచారించాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు కేసును కొట్టివేసిందని చెప్పారు. ఈ వాదనను మత్తయ్య తరఫు న్యాయవాది ఖండించారు. ఆయన క్రైం సీన్‌లో లేరని, కేసులో ఇరికించారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పును సమర్ధించింది. తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టి పారేసింది. దీంతో మత్తయ్యకు ఊరట లభించింది.
ఇవి కూడా చదవండి
ట్రంప్‌తో పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ మీటింగ్.. 80 నిమిషాలు ఏం మాట్లాడారు..