Share News

Ration Cards: మీ సేవల్లో రేషన్‌ కార్డులకు దరఖాస్తులు

ABN , Publish Date - Feb 08 , 2025 | 02:30 AM

కొత్త రేషన్‌ కార్డుల జారీలో అవలంబించాల్సిన విధానం, అర్హతల గురించి ఇప్పటికే సబ్‌ కమిటీ ఇచ్చిన సూచనలను ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. దీనిప్రకారం కొత్త కార్డులు, ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను జత చేసేందుకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్‌ తెలిపారు.

Ration Cards: మీ సేవల్లో రేషన్‌ కార్డులకు దరఖాస్తులు
Telangana Ration Cards

నేటి నుంచి స్వీకరణ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. శనివారం నుంచి మీ సేవ కేంద్రాల ద్వారా ఈ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ తెలిపారు. కొత్త రేషన్‌ కార్డుల జారీలో అవలంబించాల్సిన విధానం, అర్హతల గురించి ఇప్పటికే సబ్‌ కమిటీ ఇచ్చిన సూచనలను ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. దీనిప్రకారం కొత్త కార్డులు, ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను జత చేసేందుకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. కొత్త రేషన్‌ కార్డులతోపాటు ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దరఖాస్తులను ప్రజాపాలన సేవా కేంద్రాల్లో స్వీకరించాలని ఇప్పటికే ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది.


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 08 , 2025 | 09:18 AM