Share News

TG Higher Education Council: ఎన్‌ఈపీ అమలు చేస్తున్నాం

ABN , Publish Date - May 02 , 2025 | 07:47 AM

టెలంగానా ఉన్నత విద్యా మండలి, జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020ని అమలు చేస్తూ యూజీసీ ఆదేశాలను పాటిస్తామని ప్రకటించింది. ఈ విషయంపై విద్యా కమిషన్‌, విశ్వవిద్యాలయాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

TG Higher Education Council: ఎన్‌ఈపీ అమలు చేస్తున్నాం

  • యూజీసీ ఆదేశాలు పాటిస్తాం

  • రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయానికి భిన్నంగా ఉన్నత విద్యా మండలి వివాదాస్పద లేఖ

హైదరాబాద్‌, మే 1(ఆంధ్రజ్యోతి): ‘జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020 విద్యా వ్యవస్థకు గొడ్డలిపెట్టు.. విద్య కాషాయీకరణ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీన్ని వాడుకుంటోంద’ని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ విద్యా కమిషన్‌, వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, విద్యావేత్తలు, నిపుణులు ఒకవైపు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాత్రం భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎన్‌ఈపీలో సూచించినట్లు ఉన్నత విద్యలో మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపింది. అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్రీరామ్‌ వెంకటేశ్‌ గురువారం యూజీసీకి రాసిన లేఖ వివాదాస్పదంగా మారింది. ఆ లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. ఎన్‌ఈపీని తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉచిత విద్యను లేకుండా చేసి, పూర్తిగా ప్రైవేటుపరం చేయాలన్న లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోందని రాష్ట్ర సర్కారు పేర్కొంటోంది. వీసీలు, ప్రొఫెసర్ల నియామకాలపై ఇటీవల విడుదల చేసిన ముసాయిదా బిల్లు కూడా వివాదాస్పదంగా మారింది.

Updated Date - May 02 , 2025 | 07:48 AM