Justice Sharad Kumar Sharma: ఈ కేసు విచారణ నుంచి నేను తప్పుకొంటున్నా!
ABN , Publish Date - Aug 27 , 2025 | 04:02 AM
న్యాయ వ్యవస్థకు చెందిన అత్యంత గౌరవనీయమైన సభ్యుడొకరు.. ఒక కేసులో.. ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరించాల్సిందిగా కోరారంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్
ఇందులో ఒక పక్షానికి అనుకూలంగా ఉండమన్నారు..
ఉన్నత న్యాయవ్యవస్థకు చెందిన సభ్యుడొకరు కోరారు
నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్
న్యాయమూర్తి శరద్‌కుమార్ శర్మ
హైదరాబాద్‌కు చెందిన కెఎల్‌ఎస్‌ఆర్
ఇన్‌ఫ్రాటెక్, ఏఎస్ మెట్ కార్ప్ కేసులో..
న్యూఢిల్లీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): న్యాయ వ్యవస్థకు చెందిన అత్యంత గౌరవనీయమైన సభ్యుడొకరు.. ఒక కేసులో.. ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరించాల్సిందిగా కోరారంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)కి చెందిన న్యాయమూర్తి, జస్టిస్ శరద్‌కుమార్ శర్మ కేసు విచారణ నుంచి తప్పుకొన్నారు. హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ కేఎల్‌ఎ్‌సఆర్ ఇన్‌ఫ్రా టెక్ లిమిటెడ్, ఏఎస్ మెట్ కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మధ్య నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్‌లో కేసు నడిచింది. అక్కడి తీర్పును కేఎల్‌ఎ్‌సఆర్ ఇన్‌ఫ్రా టెక్ కంపెనీ.. చెన్నై బెంచ్‌లో సవాల్ చేసింది. ఈ కేసులో జూన్ 18న బెంచ్ తీర్పును రిజర్వు చేసింది. అయితే.. ఆగస్టు 13న ఈ కేసులో ఆదేశాలు వెలువరించడానికి ముందు.. అనూహ్యంగా ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ శరద్‌కుమార్ శర్మ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆరోపణలు చేశారు. ‘‘ఈ దేశంలోని ఉన్నత న్యాయవ్యవస్థలోని అత్యంత గౌరవనీయమైన సభ్యులలో ఒకరు, ఒక నిర్దిష్ట పార్టీకి అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ మాలో ఒకరిని సంప్రదించడం నాకెంతో బాధ కలిగించింది. అందువల్ల, నేను ఈ విషయాన్ని విచారించడానికి నిరాకరిస్తున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.
కేసు నుంచి తప్పుకోవడానికి ముందు.. ఆయన తన మొబైల్‌ఫోన్‌కు వచ్చిన ఒక సందేశాన్ని ఈ కేసులో వాదనలు వినిపిస్తున్న లాయర్లకు చూపించినట్టు సమాచారం. అయితే.. రెండు పార్టీల్లో ఎవరి తరఫున సంప్రదించారు? ఇంతకీ న్యాయవ్యవస్థలో ఆ గౌరవనీయుడైన సభ్యుడు ఎవరు? అనే దానిపై మాత్రం స్పష్టత రాలేదు. కాగా.. న్యాయవ్యవస్థకు సంబంధించిన వార్తలను ప్రచురించే ‘బార్ అండ్ బెంచ్’ వెబ్‌సైట్‌లో దీనిపై ఆగస్టు 13నే ఒక కథనం ప్రచురితమైంది. అందులో.. ఒక పక్షానికి అనుకూలంగా ఆదేశాలివ్వాలంటూ జస్టిస్ శరద్‌కుమార్ శర్మను సంప్రదించింది.. ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి అని పేర్కొనడం గమనార్హం.