Share News

IIT Hyderabad: సెప్టెంబరులో ఐఐటీహెచ్‌లో హ్యాకథాన్‌ పోటీలు

ABN , Publish Date - Jun 08 , 2025 | 05:34 AM

ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆధ్వర్యంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో కేంద్ర ఆర్థిక సేవల విభాగం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ-హైదరాబాద్‌లో సెప్టెంబర్‌ 2, 3 తేదీల్లో ఫిన్‌షీల్డ్‌ హ్యాకథాన్‌ సీరీస్‌-2025 పోటీలు నిర్వహిస్తోంది.

IIT Hyderabad: సెప్టెంబరులో ఐఐటీహెచ్‌లో హ్యాకథాన్‌ పోటీలు

కంది, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆధ్వర్యంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో కేంద్ర ఆర్థిక సేవల విభాగం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ-హైదరాబాద్‌లో సెప్టెంబర్‌ 2, 3 తేదీల్లో ఫిన్‌షీల్డ్‌ హ్యాకథాన్‌ సీరీస్‌-2025 పోటీలు నిర్వహిస్తోంది. ఈ మేరకు ఐఐటీహెచ్‌ అధికారులు శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. మొబైల్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌లో మోసాలను అరికట్టడం, బ్యాంకింగ్‌ రంగంలో సైబర్‌ సెక్యూరిటీ సవాళ్లను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల్లో దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని అధికారులు పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన బృందాలకు రూ.20 లక్షల విలువైన బహుమతులు అందజేస్తామని అధికారులు వెల్లడించారు. పోటీల్లో పాల్గొనేందుకు జూన్‌ 24 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని, వివరాలకు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News


Updated Date - Jun 08 , 2025 | 05:34 AM