Share News

పోలీ్‌సస్టేషన ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:14 AM

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పోలీసుస్టేషన ఎదుట ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు ఊదరి గోపి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పోలీ్‌సస్టేషన ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
చికిత్స పొందుతున్న గోపి

హుజూర్‌నగర్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పోలీసుస్టేషన ఎదుట ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు ఊదరి గోపి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గోపి తండ్రి కొంతకాలం క్రితం మృతిచెందగా, తల్లి పార్వతమ్మతో కలిసి ఫణిగిరిగట్టు ప్రాంతంలో గుడిసెలో ఉంటున్నారు. అక్కడే ఉన్న రైతువేదిక వద్ద గోపి తల్లి పార్వతమ్మ స్వీపర్‌గా పనిచేస్తోంది. రైతువేదికకు ఇటీవల ప్రభుత్వం ఎల్‌ఈడీటీవీ, కంప్యూటర్‌ మానిటర్‌, సీపీయూ, వీడియో కెమెరా, రెండు సౌండ్‌బాక్సులు మంజూరు చేసింది. రైతువేదిక తాళాలు పార్వతమ్మ వద్ద ఒకటి, ఏఈవో ప్రణయ్‌ వద్ద మరొకటి ఉన్నాయి. నవంబరు 12న రైతువేదికలోని రూ.2లక్షల విలువైన వస్తువులు చోరీ అయ్యాయని ఏవో స్వర్ణ పోలీసులకు ఫిర్యాదుచేశారు. అనుమానితులుగా స్వీపర్‌ పార్వతమ్మ, ఆమె కుమారుడు గోపిలను చేర్చారు. దీంతో ఎస్‌ఐ ముత్తయ్య ఇద్దరిని పోలీ్‌సస్టేషన్‌కు పిలిపించి పలుమార్లు విచారణ చేశారు. విచారణ నిమిత్తం పిలిపించటంతో శుక్రవారం మధ్యాహ్నం స్టేషన వద్దకు వచ్చిన గోపి గన్నేరు పప్పు తిని కుప్పకూలిపోవటంతో పోలీసులు ఏరియాఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం సూర్యాపేటజిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గోపి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఇదిలా ఉండగా నెలరోజులుగా తరచూ పోలీ్‌సస్టేషన్‌కు పిలిపించిన ఎస్‌ఐ ముత్తయ్య తమను పోలీసులచే కొట్టించారని వారు ఆవేదన వ్యక్తంచేశాడు. దొంగతనం చేసినట్లు అంగీకరించాలని, లేదంటే వస్తువులకు సంబంధించిన రూ.2లక్షలు ఇవ్వాలన్నారని ఆరోపించారు. ఏ తప్పు చేయలేదని వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని, రైతువేదిక రెండో తాళం ఏఈవో ప్రణయ్‌ వద్ద ఉండగా, ఆయన్ను ఎందుకు విచారించడం లేదని గోపీ, ఆయన తల్లి పార్వతమ్మ అన్నారు.

విచారణ చేయడం సాధారణం: ఎస్‌ఐ ముత్తయ్య

రైతు వేదికలో జరిగిన దొంగతనం కేసులో ఏవో స్వర్ణ ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ ముత్తయ్య తెలిపారు. గతంలో విచారణ చేశామని గోపిని కొట్టలేదన్నారు. గురువారం విచారించామని, శుక్రవారం ఉదయం మరోసారి రమ్మని కబురు చేయగా, వస్తూనేు గన్నేరు పప్పు తిన్నట్లు డ్రామా చేశాడన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 12:14 AM