బ్రెయిన్ సో్ట్రక్‌తో యువతి మృతి
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:45 AM
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన చికాకోళ్ల సాత్విక(19) సోమవారం బ్రెయినసో్ట్రక్‌తో మృతి చెందింది.

హుజూర్‌నగర్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన చికాకోళ్ల సాత్విక(19) సోమవారం బ్రెయినసో్ట్రక్‌తో మృతి చెందింది. యువతి తండ్రి శ్రీనివాసాచారి తెలిపిన వివరాల ప్రకారం హుజూర్‌నగర్‌లోని కనకదుర్గ వీధిలో నివాసం ఉంటున్న శ్రీనివాసాచారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు పృథ్వీ బీటెక్ పూర్తిచేసి ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుండగా, కుమార్తె సాత్విక హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 4వ తేదీన సాత్వికకు జ్వరం రాగా హుజూర్‌నగర్‌కు వచ్చి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఎంతకూ జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల్లో షుగర్ లెవల్స్ 700కు పెరిగాయని వైద్యులు తెలిపారు. షుగర్ లెవల్స్ పెరగడంతో ఆ ప్రభావం గుండె, కిడ్నీలపై పడగా కోమాలోకి వెళ్లి బ్రెయిన్ స్ర్టోక్‌తో మృతి చెందింది. సాత్విక మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హుజూర్‌నగర్‌లో ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసాచారి హుజూర్‌నగర్ శివాలయం కమిటీ ధర్మకర్తగా పనిచేశారు.