Share News

ఉపాధిలో నారీశక్తి

ABN , Publish Date - Mar 08 , 2025 | 01:36 AM

ఇంటి నాలుగు గోడల మధ్య నుంచి ఆమె బయటపడి కుటుంబ పోషణలో సగభాగమై శ్రమిస్తోంది. పురుషులతో సమానంగా అడుగులేస్తూ దొరికిన ప్రతీ అవకాశాన్ని వదలకుం డా దూసుకెళ్తోంది. సంక్షేమపథకాలే కాదు శ్రమైక జీవనంలో నూ ముందుంటోంది. అవకాశం ఏదైనా కావచ్చు..

ఉపాధిలో నారీశక్తి

పనిహాజరులో వారిదే పైచేయి

ఉమ్మడి జిల్లాలో 8 లక్షల మందికిపైగా మహిళలకు జాబ్‌కార్డు

(ఆంధ్రజ్యోతి,మిర్యాలగూడ అర్బన్‌): ఇంటి నాలుగు గోడల మధ్య నుంచి ఆమె బయటపడి కుటుంబ పోషణలో సగభాగమై శ్రమిస్తోంది. పురుషులతో సమానంగా అడుగులేస్తూ దొరికిన ప్రతీ అవకాశాన్ని వదలకుం డా దూసుకెళ్తోంది. సంక్షేమపథకాలే కాదు శ్రమైక జీవనంలో నూ ముందుంటోంది. అవకాశం ఏదైనా కావచ్చు.. అందిపుచ్చుకొని ఆర్థికాభివృద్ధిలో ఆమె పాత్ర కచ్చితంగా కనిపిస్తోంది. ప్రతీ పల్లెలోనూ వలసల నివారణకు అమలులోకి తెచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం అమలులో నారీమణులుకీలక పాత్ర పోషిస్తున్నారు. పని ప్రదేశాల్లో ఎక్కడ చూసినా వారి సం ఖ్యాబలమే ఎక్కువగా కనిపిస్తోంది. జిల్లాకు మంజూరైన ఉపాధి నిధులను ఖర్చు చేయడంతో వచ్చే 15శాత మెటీరియల్‌ కాం పొనెంట్‌ నిధులు దక్కించుకునేందుకు వారు ఏటా చెమటోడ్చుతున్నారు. ఫలితంగా ప్రతీ మండలానికి ఏటా కనీసం కోటి రూపాయల ఈజీఎస్‌ నిధులు మంజూరై పల్లె అభివృద్ధికి ఖర్చవుతున్నాయి.

ఉపాధిహామీ పథకం వినియోగంలో నారీమణులు తమ శక్తి యుక్తులను ప్రదర్శించి పరోక్షం గా గ్రామాభివృద్ధికి బాసటగా నిలుస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పురుషులకంటే మహిళలు ఉపాధిహామీ పథకాన్ని అత్యధికంగా వినియోగించుకుంటున్నారు. ఈ పథకం కింద గ్రామాల్లో జరిగే ప్రతీ పనికి హాజరై అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. ఏటా వేసవి సీజన్‌లో జరిగే పనులకు హాజరయ్యేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మహిళా కూలీల హాజరుశాతం అధికంగా నమోదవుతున్నట్లు నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎంఎంఎ్‌స) గణాంకాలు చెబుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలో రూ.422కోట్ల నిధులు

గ్రామీణ ప్రాంతంలో జాబ్‌కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి ఉపాధిహామీ పథకం వర్తింపజేపేందుకు అధికారయంత్రాంగం కృషిచేస్తోంది. 2024- 25ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో రూ.422 కోట్ల నిధులను ఇప్పటికే కూలీల వేతనాల కోసం ఖర్చుచేశారు.నల్లగొండ జిల్లాలో 3,59, 768 జాబ్‌కార్డుల్లో 7,64,390 మంది కూ లీలు ఉన్నారు. 2024-25 సంవత్సరం లో ప్రతీ కుటుంబానికి 100రోజుల పని కల్పించేందుకు 82,22,218 పనిదినాలు మంజూరుకాగా, 63,8 8,894 పనిదినాలు పూర్తిచేసి రూ.193 కోట్ల నిధుల వినియోగం జరిగింది. సూర్యాపేట జిల్లాలో 2,62,632 కుటుంబాలకు జాబ్‌కార్డులు, 5,70, 256మంది కూలీలు ఉండగా, 65,17,562 పనిదినాలకు 51,12,894 పనిదినాలు ఉపయోగించి రూ.154కోట్ల నిధులు సద్వినియోగం చేసుకున్నారు. యాదాద్రి జిల్లాలో 1,43,220 కుటుంబాలకు జాబ్‌కార్డు, 2,85, 316మంది కూలీలు ఉండగా, 24,87,832 పనిదినాలను వినియోగించుకోగా రూ.75కోట్ల నిధులు ఖర్చుచేశారు. దీంతో ఉమ్మడి జిల్లాకు మెటీరియ ల్‌ కాంపొనెంట్‌ ఫండ్‌కింద 15శాతం ఈజీఎస్‌ నిధులు మంజూరు కావడంతో అభివృద్ధి ప్రాతిపదికన మండలాల వారీగా ఆయా నిధులను వెచ్చించి ఈ నెలాఖరునాటికి ఖర్చు చేసేందుకు అధికారులు కృషిచేస్తున్నారు.

మహిళా కూలీలే అధికం..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7,65,620 కుటుంబాలకు ఉపాధిహామీ పథకం జాబ్‌కార్డు ఉండగా, 15,98,127 మంది కూలీలు నమోదై ఉన్నారు. వీరిలో 7,91,620 మంది పురుషులుండగా, 8,06,507 మంది మహిళా కూలీలు ఉన్నారు. అయితే ఉపాధి హామీ పథకం పనులు ప్రధానంగా ఏప్రిల్‌ మాసం నుంచి ముమ్మరంగా సాగుతాయి. దీంతో ప్రతీ రోజు సగటున 3.74లక్షల మంది కూలీలు పనులకు హాజరవుతుంటారని అధికారులు చెబుతున్నారు. అందుల్లో 70శాతం మంది మహిళా కూలీలే పని ప్రదేశాలకు వస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరంతా కష్టపడడంతో దినసరి వేతనాల కింద ఉపాధి నిధుల ఖర్చు జరిగితే గ్రామాభివృద్ధికోసం 15శాతం ఉపాధిహామీ నిధులు మంజూరై సీసీరోడ్లు, అంగన్‌వాడీ కేంద్రం పక్కాభవనం, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణ వంటి అభివృద్ధి పనులు చక్కబడుతున్నాయి. అయితే ఉపాధి హామీపథకాన్ని వినియోగించడంలో మహిళా కూలీలు ముందుండడంతో ఈ నిధుల మంజూరు సాధ్యపడుతుండగా, గ్రామాభివృద్ధిలో నారీమణులపాత్ర పరోక్షంగా కనిపిస్తోంది.

రూ.92కోట్ల నిధులొచ్చాయితి: శేఖర్‌రెడ్డి, డీఆర్‌డీవో, నల్లగొండ

మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు రూ.92కోట్ల ఈజీఎస్‌ నిధులు మంజూరయ్యాయి. ఉపాధిహామీ పథకం కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి మంజూరైన లేబర్‌ బడ్జెట్‌ను 82శాతానికి పూర్తిచేయడం జరిగింది. కూలీల వేతనాల చెల్లింపు కింద ఖర్చుచేసిన నిధుల ఆధారంగా మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద 15శాతం నిధులు గ్రామాభివృద్ధికి కేటాయించడం జరుగుతోంది. ఈ వార్షిక సంవత్సరంలో ఖర్చుచేసిన ఉపాధి నిధుల ఆధారంగా రూ.32.59కోట్ల నిఽధులు ఖర్చుచేయాల్సి ఉంది. మండలానికి సగటున రూ.కోటి వరకు అభివృద్ధి నిధులు మంజూరు కాగా, సీసీరోడ్లు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ఖర్చుచేస్తున్నాం.

మహిళా కూలీల పాత్ర కీలకమైంది: జి.తులసి, ఫీల్డ్‌అసిస్టెంట్‌, వేములపల్లి

ఉపాధిహామీ పథకాన్ని వినియోగించుకోవడంలో పురుషులకంటే మహిళా కూలీల పాత్ర కీలకంగా ఉంది. పని ప్రదేశాల్లో మహిళా కూలీల హాజరుశాతం అధికంగా నమోదవుతోంది. ఏటా ప్రతీ రోజు పనులకు హాజరయ్యే కూలీల్లో ఎక్కువమంది వారే ఉంటూ లేబర్‌ బడ్జెట్‌ వినియోగంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మహిళా కూలీలు కష్టపడడంతోనే కంపొనెంట్‌ నిధులుమంజూరై గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి.

Updated Date - Mar 08 , 2025 | 01:36 AM