Share News

‘ఇంటిగ్రేటెడ్‌’ పనులకు మోక్షమెప్పుడో?

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:53 AM

టెంపు ల్‌ సిటీలో సమీకృత మార్కెట్‌ భవన సముదాయం పనులు కన్నేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. ఒక అడుగు ముందుకు పది అడుగులు వెనక్కి అన్న చందంగా పనులు సాగుతు న్నా యి.

‘ఇంటిగ్రేటెడ్‌’ పనులకు మోక్షమెప్పుడో?

యాదగిరిగుట్ట రూరల్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): టెంపు ల్‌ సిటీలో సమీకృత మార్కెట్‌ భవన సముదాయం పనులు కన్నేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. ఒక అడుగు ముందుకు పది అడుగులు వెనక్కి అన్న చందంగా పనులు సాగుతు న్నా యి. ప్రజలకు నిత్యావసర సరుకులు వేర్వేరు చోట్ల కొనుకోలు చేయడం ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఒకే చోట నిత్యావసర సరుకులు, పం డ్లు, పూలు, కాయగూరలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు, చికెన్‌, మటన్‌, చేపలు లభించేలా భవన సముదాయం నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించారు. పచ్చదనం ఉట్టిపడే విధంగా గ్రీనరీ, పార్కింగ్‌, నీటి సౌకర్యం అన్ని సౌకర్యాలతో యాదగిరిగుట్ట పట్టణంలో సమీకృత వెజ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ ఏర్పాటు చేయాలనే సంకల్పంతో గత ప్రభుత్వం ముందుకు వచ్చింది. పనులు ప్రారంభించినప్పటికీ నిధుల లేమితో అసంపూర్తిగా నిలిచిపోయింది.

ప్రభుత్వ మార్పుతో..

యాదగిరిగుట్ట పట్టణంలో గత ప్రభుత్వం స్థానిక అంగడి బజార్‌ ప్రాంతంలో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ ఏర్పాటు చేయడానికి 2022 సంవత్సరంలో టీయూఎ్‌ఫఐయూడీసీ ద్వారా రూ.3.24కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించి టెండర్‌ ద్వారా పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. వెంటనే పనులు ప్రారంభించాలని గత ప్రభు త్వం అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దాంతో సంబంధిత కాంట్రాక్టర్లు ముందుగా తమ సొంత నిధులతో పనులు ప్రారంభించారు. సుమారు రూ.1.50కోట్ల వ్యయంతో పిల్లర్ల వరకు నిర్మాణాలు చేపట్టారు. ఈలోపు ప్రభుత్వం మారి నూతన కాం గ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది. దీంతో నిధులు రావడం లేదని నిధు లు వస్తేనే పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్‌ తిష్టవేసి కూర్చున్నారు. పనులు పూర్తి చేయాలంటే జిల్లా అధికారులు నిధులు కేటాయిస్తారా లేదా ఎప్పడు మంజూరు చేస్తారోనని భవనం ఎప్పుడు పూర్తవుతుందో అని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు.

నిధులు కేటాయించి.. పనులు పూర్తి చేయాలి

పట్టణంలో అసంపూర్తితో నిలిచిపోయిన ఇంటిగ్రేటెడ్‌ పనులకు ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి పూర్తి చేయించాలి. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య వెంటనే స్పందించి నిధులు కేటాయింపులో చొరవ తీసుకోవాలి త్వరగా మార్కెట్‌ నిర్మాణ పనులు పూర్తి చేయించాలి.

-ఎరుకల చైతన్యగౌడ్‌, యాదగిరిగుట్ట

బిల్లులు రావడం లేదని..

పట్టణంలోని ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి బిల్లు రావడం లేదని కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. బిల్లులు రాగానే పనులు త్వరగా పూర్తి చేయిస్తా.

-అజయ్‌కుమార్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌, యాదగిరిగుట్ట

Updated Date - Feb 14 , 2025 | 12:57 AM