సహకార ఎన్నికలు లేనట్టే(నా)?
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:43 AM
సహకార సంఘాల ఎన్నికలు సకాలంలో జరిగే అవకాశం లేదనే అంశంపై చర్చ మొదలైంది. ఎన్నికలపై ప్రభుత్వ నిర్ణయం వెలువడకపోవడంతో ఇప్పట్లో జరగవని, స్థానికంగా ఉన్న ఆశావహులు మదనపడుతున్నారు.

ఫిబ్రవరి 15తో పీఏసీఎస్, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల పదవీకాలం ముగింపు
సంఘాల్లో కనిపించని ఎన్నికల హడావుడి
ఉమ్మడి జిల్లాలో మొత్తం107 పీఏసీఎ్‌సలు
ఆశావహుల్లో నిరాశ
యాదాద్రి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): సహకార సంఘాల ఎన్నికలు సకాలంలో జరిగే అవకాశం లేదనే అంశంపై చర్చ మొదలైంది. ఎన్నికలపై ప్రభుత్వ నిర్ణయం వెలువడకపోవడంతో ఇప్పట్లో జరగవని, స్థానికంగా ఉన్న ఆశావహులు మదనపడుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార(పీఏసీఎ్‌స)సంఘాల్లో ఎన్నికల హడావుడి కన్పించడంలేదు. పీఏసీఎస్ సంఘాల పాలకవ ర్గం గడువు మరికొద్ది రోజుల్లో ముగియనుంది. సహకార సంఘాల సభ్యుల్లో ఎన్నికల కోలాహ లం కన్పించడంలేదు. సాఽధారణంగా పాలకవ ర్గం గడువు ముగుస్తుందన్న ఆరు నెలల ముం దుగానే ఎన్నికల పక్రియను మొదలు పెట్టాలి. ఫిబ్రవరి 15వ తేదీతో పీఏసీఎ్‌సలు, డీసీసీబీ, డీసీఎంఎ్‌సల పాలకవర్గం గడువు ముగుస్తున్నప్పటికీ, రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ర్టార్ నుంచి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎ లాంటి ప్రకటన విడుదల కాలేదు. దీంతో ఎన్నికలు ఇప్పుడు జరగనట్టేనని రైతుల్లో సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. ప్రభుత్వం ఇప్పటికే గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల మాదిరిగానే సహకార సంఘాల ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని స్థానికం గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న పలు పార్టీలకు చెందిన నేతలు చర్చించుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 107 పీఏసీఎ్‌సలున్నాయి. నల్లగొండ జిల్లాలో 42, యాదాద్రి భువనగిరి జిల్లాలో 21, సూర్యపేట జిల్లాలో 44వరకు పీఏసీఎ్‌సలు ఉన్నాయి. 2020ఫిబ్రవరి 15నజిల్లా కేంద్ర సహకార బ్యాం కు(డీసీసీబీ),జిల్లా సహకార మార్కెటింగ్ సహకార సంస్థ(డీసీఎంఎస్) చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికలు జరిగాయి. మరో 16 రోజుల్లోగా పాలకవర్గం గడువు ముగుస్తుంది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందా? పర్సన్ ఇన్‌చార్జీలను నియమిస్తుందా? ప్రస్తుతం ఉన్న పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగిస్తుందా? అన్నది పీఏసీఎస్ పోటీ చేసే ఆశావాహుల్లో చర్చనీయాంశంగా మారింది. సహకార ఎన్నికలు కూడా వాయిదా పడనుండటంతో ఆశావాహుల్లో నిరాశ నెలకొంది.
పర్సన్ ఇన్‌చార్జీలా... పదవీకాలం పొడిగింపా..?
సహకార సంఘాలకు ఎన్నికలు సకాలంలో జరిగే అవకాశం కన్పించకపోవడంతో, వాటిని వాయిదా వేసే అవకాశం ఉందని సహకార సంఘాల వర్గాలు భావిస్తున్నాయి. పాలకవర్గాలు పదవీకాలం ఫిబ్రవరి 15తో ముగియనుండటంతో ప్రభుత్వం పీఏసీఎ్‌సలకు పర్సన్ ఇన్‌చార్జీలను నియమించే అవకాశం ఉంది. అయితే పర్సన్ ఇన్‌చార్జీలు ప్రస్తుతం ఉన్న సహకార సంఘాల బాధ్యులను... లేదంటే ప్రత్యేక అధికారులను నియమించే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టతలేదు. మరోవైపు ప్రస్తుతం ఉన్న పాలకవర్గాల పదవీకాలం గడువు ఆరునెలల వరకు పొడిగించే అవకాశం లేకపోలేదని సహకార వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే గతంలో ఎన్నికైన మెజార్టీ పీఏసీఎస్ చైర్మన్లు బీఆర్‌ఎ్‌సకు మద్దతుదారులుగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలామంది చైర్మన్లు, వైస్ చైర్మన్లు కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించని పక్షంలో పదవీ కాలాన్ని పొడిగించాలన్న విజ్ఞప్తిని ప్రభుత్వానికి చేసే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని జిల్లాల్లో పరిస్థితులను పరిశీలించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
కొత్తగా మరికొన్ని పీఏసీఎ్‌సలు
ప్రస్తుతం ఉన్న పీఏసీఎ్‌సలకు తోడుగా... కొత్తగా సహకార సంఘాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సహకార శాఖ కమిషనర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నూతనంగా ఏర్పాటు చేసే పీఏసీఎ్‌సల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీచేసింది. సహకార శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న పీఏసీఎ్‌సల పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న సంఘాల జాబితాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపింది. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 107పీఏసీఎ్‌సలు ఉండగా, నల్లగొండ జిల్లాలో 42, యాదాద్రి భువనగిరి జిల్లాలో 21, సూర్యాపేట జిల్లాలో 44వరకు పీఏసీఎ్‌సలు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్తగా దాదాపు 5 పీఏసీఎ్‌సలు, నల్లగొండ, సూర్యాపేటలో నూతనంగా మరో 16 వరకు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. సహకార సంఘాలు పెరగనున్నందున అందు కు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. చట్టబద్దంగా ప్రస్తుతం ఉన్న సంఘాలనుంచి గ్రామాలను విడదీసి కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు, నియమ నిబంధనలు వెలువడగానే వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటివరకు కొత్త సంఘాల ఏర్పాటుపై కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఇందుకు సంబంధించిన సహకార సంఘాల అధికారులను సంప్రదించగా, నూతనంగా ఏర్పడనున్న పీఏసీఎ్‌సల జాబితాను ప్రభుత్వానికి పంపామని, ప్రభు త్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదని వెల్లడించారు.