వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తాం
ABN , Publish Date - Jan 18 , 2025 | 01:02 AM
వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలందిస్తామని సుధా బ్యాంక్ చైర్మన మీలా మహదేవ్ అన్నారు.

సూర్యాపేట టౌన, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలందిస్తామని సుధా బ్యాంక్ చైర్మన మీలా మహదేవ్ అన్నారు. సుధా బ్యాంక్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని సుధా బ్యాంక్‌లో నిర్వహించిన రజతోత్సవంలో ఆయన మాట్లాడారు. 25 ఏళ్లుగా బ్యాంకు ఖాతాదారులకు అన్నిరకాలుగా సేవలందిస్తూ వస్తున్నామన్నారు. ఖాతాదారుల నమ్మకమే పెట్టుబడిగా సుధా బ్యాంక్ పనిచేస్తోందని స్పష్టం చేశారు. రజతోత్సవం సందర్భంగా ఈ నెల 22న త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసురాలు, డాక్టర్ ద్వారం లక్ష్మి హాజరుకానున్నట్లు తెలిపారు. అనంతరం సూర్యాపేట సర్వీస్ బ్రాంచలో నూతనంగా ఏర్పాటుచేసిన స్ర్టాంగ్‌రూంను ప్రారంభించి మొదటి లాకర్‌ను భాగ్యశ్రీ ఎలకి్ట్రకల్స్ యజమాని వెంకటేశ్వర్లుకు అందజేశారు. కార్యక్రమంలో సుధా బ్యాంక్ ఎం డీ పెద్దిరెడ్డి గణేష్, వైస్‌చైర్మన పొనుగోటి నిర్మల, డైరెక్టర్లు భోనగిరి భాస్కర్, కక్కిరేణి చంద్రశేఖర్, శంకర్‌లాల్, శ్రవణ్‌కుమార్, సుజాత, డాక్టర్ మీలా సందీప్, పట్టణ ప్రముఖులు పెద్దిరెడ్డి రాజా, తోట శ్యాం, గుడిపూడి వెంకటేశ్వర్‌రావు, శ్రీనివాస్, సత్యనారాయణ, లక్ష్మారెడ్డి, ర వీందర్‌రెడ్డి, శ్రీనివాస్, మేనేజర్లు సైదులు, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.