Share News

అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:23 AM

ఆలయ అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, పబ్లిక్‌ క్లబ్‌ సెక్రటరీ కొప్పుల వేణారెడ్డి అన్నారు.

అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి
ప్రమాణస్వీకారం చేస్తున్న నూతన పాలకవర్గ సభ్యులు

చివ్వెంల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : ఆలయ అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, పబ్లిక్‌ క్లబ్‌ సెక్రటరీ కొప్పుల వేణారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని దురాజ్‌పల్లిలో పెద్దగట్టు శ్రీలింగమంతులస్వామి దేవాలయ చైర్మనగా పోలెబోయిన నర్సయ్యయాదవ్‌తో పాటు కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో వారు మాట్లాడారు. ఐదు రాష్ట్రాల నుంచి భక్తులు జాతరకు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, వారికి కావాల్సిన మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. గతంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీసీరోడ్లు, గుట్టపై హాల్‌ నిర్మించారన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కుర్ర సైదులు, వీరబోయిన సైదులు, సిరిపంగి సైదమ్మ, మెంతబోయిన లింగస్వామి, మెంతబోయిన చిన్నమల్లయ్య, పోలెబోయిన నరే్‌షపిళ్లై, కాంగ్రెస్‌ నాయకులు చకిలం రాజేశ్వర్‌రావు, కుమ్మరికుంట్ల వేణుగోపాల్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ధరావత వీరన్ననాయక్‌, చింతమల్ల రమేష్‌, చింత శ్రీను, సతీష్‌, జనార్ధన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 12:23 AM