సమన్వయంతో ఉర్సును నిర్వహించాలి
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:16 AM
అధికారులు సమన్వయంతో పనిచేసి జానపహాడ్ ఉర్సును సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు.

పాలకవీడు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : అధికారులు సమన్వయంతో పనిచేసి జానపహాడ్ ఉర్సును సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ దర్గాలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం దర్గా సమీపంలోని ఫంక్షనహాల్‌లో నిర్వహించిన ఉర్సు సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 23, 24, 25 తేదీ ల్లో నిర్వహించే ఉర్సుకు వచ్చే భక్తులకు మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అన్నివసతులకు అవసరమయ్యే పనుల ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. రూ.10లక్షల చొప్పున దర్గా పరిసర ప్రాంతంలో సీసీ రోడ్డు పనులు చేయిస్తామని డెక్కన, పెన్నా సిమెంట్ కర్మాగారాల బాధ్యులు హామీఇచ్చారు. మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట ఆర్టీసీ డిపోల నుంచి 40 బస్సులను నిరంతరాయంగా నడుపుతామని ఆయా డిపోల మేనేజర్లు తెలిపారు. డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ 400 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్‌డీవో శ్రీనివాసులు, ఎంపీడీవో లక్ష్మి, సీఐ చరమందరాజు, తహసీల్దార్ కమలాకర్, స్థానిక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సమస్యలతో వచ్చే ప్రజలను ఆదుకోవాలి
సూర్యాపేట(కలెక్టరేట్): సమస్యలతో వచ్చే ప్రజలకు సహా యం చేస్తూ వారిని ఆదుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి టీజీపీఎ్‌ససీ ద్వారా ఉద్యోగం పొందిన 47మందికి నియామకపత్రాలు అందజేసి, మాట్లాడారు. కార్యక్రమంలో ఏవో సుదర్శనరెడ్డి, పద్మారావు, సిబ్బంది, అభ్యర్థులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలి
రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాల ని కలెక్టర్ తేజ్‌సనందలాల్ పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు-2025 వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి జీ సురే్‌షరెడ్డి, ఎంబీఏ జయప్రకా్‌షరెడ్డి, ఆదిత్య, ఆంజనేయులు పాల్గొన్నారు.
సూర్యాపేటటౌన: దేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని కలెక్టరేట్‌లో నిర్వహించారు.ఆమె చిత్రపటానికి కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్ పూలమాల వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో డీఈవో అశోక్, అధికారులు పాల్గొన్నారు.