Share News

నిధులు రాబట్టడంలో కేంద్ర మంత్రులు విఫలం

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:33 AM

కేంద్రప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆరుగురు ఎంపీలు విఫలమయ్యారని సీపీఎం జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ.జహంగీర్‌ విమర్శించారు.

  నిధులు రాబట్టడంలో కేంద్ర మంత్రులు విఫలం
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం నేత జహంగీర్‌

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జహంగీర్‌

చౌటుప్పల్‌ టౌన, పిబ్రవరి 6 ( ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆరుగురు ఎంపీలు విఫలమయ్యారని సీపీఎం జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ.జహంగీర్‌ విమర్శించారు. చౌటుప్పల్‌ పట్టణంలోని కందాల రంగారెడ్డి భవన లో గురువారం జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో జహంగీర్‌ మాట్లాడారు. గోదావరి జలాల అనుసంధానం, మూసీ నది ప్రక్షాళన వంటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూపాయి కేటాయించలేదని ఆయన అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిదులను కేటాయించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి నిదులను రాబట్టడంలో విఫలమైన బీజేపీ నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షతపై గ్రామాల్లో నిరసన కార్యక్రమాలను చేపడతామని ఆయన తెలిపారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బూర్గు కృష్ణారెడ్డి, మండల కార్యదర్శి గంగదేవి సైదులు, పీఏసీఎస్‌ మాజీ చైర్మన చీరిక సంజీవ రెడ్డి, డీవైఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు పల్లె మధుకృష్ణ, నాయకులు రాగీరు కిష్టయ్య, బోయ యాదయ్య, తడక మోహన, చింతల సుదర్శన, కొండె శ్రీశైలం, బోదాస్‌ వెంకటేశ, నందీశ్వర్‌, మీసాల శ్రీను, చెరుకు లక్ష్మమ్మ కొంతం సుశీల, సోనీ పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 12:33 AM