Share News

ఉడకని అన్నం..నీళ్ల చారు

ABN , Publish Date - Jan 09 , 2025 | 12:51 AM

యాదగిరిగుట్ట పట్టణంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలోని హాస్టల్‌ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊట్కూరి అశోక్‌గౌడ్‌, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కర్రె ప్రవీణ్‌, గుంటిపల్లి సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య డిమాండ్‌ చేశారు.

ఉడకని అన్నం..నీళ్ల చారు
ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లుతో మాట్లాడుతున్న బీజేపీ నాయకులు

గుట్ట పాలిటెక్నిక్‌ కళాశాల హాస్టల్‌ను పరిశీలించిన బీజేపీ నాయకులు

కాంట్రాక్టర్‌, వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

యాదగిరిగుట్ట రూరల్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట పట్టణంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలోని హాస్టల్‌ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊట్కూరి అశోక్‌గౌడ్‌, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కర్రె ప్రవీణ్‌, గుంటిపల్లి సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య డిమాండ్‌ చేశారు. బుధవారం వారు ప్రిన్సిపాల్‌ అనుమతితో కళాశాలలోని హాస్టల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంబంధిత కాంట్రాక్టర్‌, వార్డెన్‌ కుమ్మకై విద్యార్థులకు ఉడకని అన్నం, నీళ్లచారుతో భోజనం పెడుతున్నారని అన్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడంతో విద్యార్థిని, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలతో సతమతం అవుతున్న విద్యార్థుల్లో ఒక విద్యార్థి తమ నాయకుల వద్దకు వచ్చి వారి సమస్యలను వివరించారని తెలిపారు. నెలకు ప్రతి విద్యార్థి నుంచి రూ.2800 వసూలు చేసి ఇలా భోజనం పెట్టడం ఏమిటని వార్డెన్‌, ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం లేదని పేర్కొన్నారు. హాస్టల్‌ను ఇప్పటికి మూడు సార్లు సందర్శించి అధికారులు దృష్టికి తీసుకవెళ్లినప్పటికీ వారిలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల కడుపులు కొడుతున్న సంబంధిత కాంట్రాక్టర్‌, వార్డెన్‌, సంబంధిత అఽధికారులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బేజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల చంద్రమౌళి, గజం సంతో్‌షగౌడ్‌, మందోజు నరేష్‌, బోడ బుచ్చిబాబు, ఆలేటి కర్ణ, ఆకుల దేవేందర్‌ ఉన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 12:51 AM