Share News

దివ్యాంగులకు యూడీఐడీ కేటాయించాలి

ABN , Publish Date - Mar 02 , 2025 | 12:40 AM

దివ్యాంగులకు ఇకపై సదరం సర్టిఫికెట్ల జారీ విధానం ఉండదని, వారికి యూడీఐడీ కార్డులు జారీ చేయాలని సెర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్‌ అన్నారు.

దివ్యాంగులకు యూడీఐడీ కేటాయించాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో సెర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్‌

భువనగిరి (కలెక్టరేట్‌), మార్చి 1 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు ఇకపై సదరం సర్టిఫికెట్ల జారీ విధానం ఉండదని, వారికి యూడీఐడీ కార్డులు జారీ చేయాలని సెర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్‌ అన్నారు. దివ్యాంగులకు యూనిక్‌ డిసెబులిటీ ఐడీ (యూడీఐడీ) కార్డుల జారీ, సోలార్‌ ప్లాంట్ల ప్రగతిపై శనివారం హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సదరం బదు లు యూడీఐడీ కార్డులు జారీ చేయాలన్నారు. వైద్యులు ధ్రువీకరించిన వైకల్య శాతం సర్టిఫికెట్‌ను, దివ్యాంగుల పూర్తి వివరాలను యూడీఐడీ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. యూడీఐడీ కార్డులు స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా నేరుగా దివ్యాంగుల చిరునామాకు చేరుతాయన్నారు. ఈ కార్డు కోసం మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి కుసుం పథకం కింద సౌర విద్యుత్‌ ప్లాంట్లకు గు ర్తించిన స్థలాల్లో ఏర్పాట్లకు డీపీఆర్‌లను పంపించాలన్నారు. కలెక్టర్‌ ఎం.హనుమంతరావు,అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి,డీఆర్‌డీవో నాగిరెడ్డి, జిల్లా సంక్షేమాధికారి కొండపురం నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2025 | 12:40 AM