Share News

గిరిజన బాలికల హాస్టల్‌ వార్డెన సస్పెన్షన

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:39 AM

సూర్యాపేటలోని గిరిజన బాలికల హాస్టల్‌ వార్డెన ఝాన్సీని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌పవార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చే శారు.

 గిరిజన బాలికల హాస్టల్‌ వార్డెన సస్పెన్షన

సూర్యాపేట(కలెక్టరేట్‌), జనవరి 30 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేటలోని గిరిజన బాలికల హాస్టల్‌ వార్డెన ఝాన్సీని సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌పవార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చే శారు. ఈ నెల 29న సూర్యాపేటలోని గిరినగర్‌లో ని గిరిజన బాలికల హాస్టల్‌లోని పలువురు విద్యార్థినులు విరామ సమయంలో హాస్టల్‌ బయట సమోసాలు తినడంతో అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అస్వస్థతకు గురైన విద్యార్థినులకు ప్రభుత్వజనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లకుండా, వారికి మెరుగైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వార్డెన ఝాన్సీని సస్పెండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకె ళ్లి ఉంటే ఆరోగ్యం క్షీణించేది కాదన్నారు. భవిష్యతలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే చర్యలు చేపట్టినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.

మోతె తహసీల్దార్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌పై వేటు

మోతె తహసీల్దార్‌ సంఘమిత్ర, కంప్యూటర్‌ ఆపరేటర్‌ నాగరాజును కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌పవార్‌లను సస్పెండ్‌ చేశారు. మోతె మండలం నామవరం రెవెన్యూ శివారులో చివ్వెంల మండ లం తిరుమలగిరి గ్రామానికి చెందిన మట్టపల్లి వెంకటాచలం వ్యవసాయ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన చేసినందుకు గురువారం చర్యలు తీసుకున్నారు. వెంకటాచలానికి 7.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా నాలుగేళ్ల కిందట ఆయన మృతి చెందినట్లు కలెక్టర్‌ తెలిపారు. అయితే ఆయనకు ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్యకు ఇద్దరు కుమార్తెలు జన్మించిన తర్వాత ఆమె మరణించడంతో రెండో వివాహంలో పూలమ్మను చేసుకున్నాడు. పూలమ్మకు కుమారుడు జన్మించాడు. అయితే సంబంధిత వ్యవసాయ భూమిని సూర్యాపేటలోని యూనియన బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రుణం పొందారు.

వెంకటాచలం మృతి తర్వాత మొదటి భార్యకు చెందిన ఇద్దరు కుమార్తెలు, ఆయన తల్లి లింగమ్మ, రెండో భార్య పూలమ్మ, కుమారుడు రఘు కుటుంబసభ్యులుగా ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ పొందారు. తహసీల్దార్‌ సంఘమిత్ర ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం మొదటి భార్యకు చెందిన కుమార్తెలు సైదమ్మ, రమణ పేరిట భూమిని ఫౌతి ద్వారా పట్టా మార్పిడిచేశాడు. ఈ విషయమై రెండో భార్య పూలమ్మ ఫిర్యాదు మేరకు సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవ్‌ను విచారణ చేపట్టి, అక్రమంగా పట్టామార్పిడి చేసినట్లు నిర్ధారించారు. దీంతో విధుల్లో బాధ్యతారహితంగా వ్యవహరించిన తహసీల్దార్‌ సంఘమిత్రను సస్పెండ్‌ చేయడంతో పాటు కంప్యూటర్‌ ఆపరేటర్‌ నాగరాజును విధుల నుంచి తొలగిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

గ్రామకార్యదర్శులపై చర్యలు

కోదాడ రూరల్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని గుడిబండ గ్రామకార్యదర్శి ఎస్‌కే అహ్మదా నూతనకల్‌ మండలం మాచినపల్లి గ్రామానికి బదిలీఅయ్యారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నాలుగు సంక్షేమ పథకాల అమలు కోసం గుడిబండ పైలెట్‌ గ్రామంగా ఎంపికైంది. కార్యదర్శి విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు ఆమెను బదిలీచేశారు. అదేవిధంగా అనంతగిరి మండల కేంద్ర కార్యదర్శి, చిలుకూరు మండలం శీత్లాతండా కార్యదర్శులను కూడా డీపీవో కార్యాలయానికి సరెండర్‌ చేశారు. ప్రభు త్వపథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Updated Date - Jan 31 , 2025 | 12:39 AM