60 అడుగుల గోతిలో పడ్డ టిప్పర్
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:36 AM
ఎక్కడి నుంచో జీవనోపాధి కోసం వచ్చి ఇద్దరు బడుగు జీవులు మృతువాత పడ్డారు.

మధ్యప్రదేశ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులు మృతి
ఆలేరు రూరల్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : ఎక్కడి నుంచో జీవనోపాధి కోసం వచ్చి ఇద్దరు బడుగు జీవులు మృతువాత పడ్డారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ రజినికర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ రాష్ట్రానికి చెందిన పలువురు శ్రీనివాసపురంలోని వేంకటేశ్వర క్రషర్ మిల్లులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున లోడుకోసం టిప్పర్ లారీ వెళ్తున్న క్రమంలో సుమారు 60 అడుగుల లోతులో ఉన్న క్వారీలోకి అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో డైవర్ ప్రహ్లాద్‌సింగ్(19), హెల్పర్‌గా పనిచేస్తున్న సందీ్‌పసింగ్(19) అక్కడికక్కడే మృతి చెందగా, మరొక హెల్పర్ లోకే్‌షసింగ్‌కు తీవ్రగాయాలయ్యాయి. లోకే్‌షకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రహ్లాద్, సందీ్‌ససింగ్ మృతదేహాలను ఆలేరులోని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రానికి పోస్టుమార్టం కోసం తరలించారు. వీరంతా అవివాహితులే. ఈ విషయపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. కాగా అనుమతి లేకుండా కంకర మిల్లును నడిపిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కలెక్టర్, మంత్రులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. క్రషర్స్‌తో వచ్చే దుమ్ము, ధూళితో పంటలు సైతం దెబ్బతింటున్నాయని, ఇళ్లు బీటలు పడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.