ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:39 AM
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సనప్రీతసింగ్ తెలిపారు.

శాంతిభద్రతల పర్యవేక్షణకు 300మంది పోలీసులు
సూర్యాపేట(కలెక్టరేట్), ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సనప్రీతసింగ్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఎన్నిక ల పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రణాళిక ప్రకారం విధులు నిర్వర్తించాలని సిబ్బందికి, అధికారులకు సూచించారు. ఎన్నికల సామాగ్రి ని తరలించడం,వాటికి రక్షణ కల్పించడం పోలీసుల ప్రాథమిక విధి అన్నారు. విధి నిర్వహణలో ఇబ్బందులు వస్తే అధికారులకు, స్పెషల్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. అనుమతి లేకుండా పోలింగ్ బూతలోకి ఎవరినీ అనుమతించవద్దన్నారు. జిల్లాలో 23 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించే పోలింగ్‌కు 300 మంది వినియోగిస్తున్నట్లు తెలిపారు. సాయుధుల పహారాలో పోలింగ్ సామాగ్రిని తరలిస్తామన్నారు. ఏడు రూట్లలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. 23 స్ప్టైకింగ్ ఫోర్స్ టీంలు, ఎనిమిది స్పెషల్ స్ప్టైకింగ్ టీంలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు.
ఎస్పీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది
ఎస్పీ పుట్టినరోజు సందర్భంగా జిల్లా పోలీసు సిబ్బంది మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయనతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఏఎస్పీ జనార్ధనరెడ్డి, డీఎస్పీలు రవి, శ్రీధర్‌రెడ్డి, మట్టయ్య, సీఐలు. ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.