Share News

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:35 AM

రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన చైర్మన కోదండరెడ్డి అన్నారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పొట్లపహాడ్‌లో దెబ్బతిన్న వరి కంకులను పరిశీలిస్తున్న కోదండరెడ్డి

రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన చైర్మన కోదండరెడ్డి

పెనపహాడ్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన చైర్మన కోదండరెడ్డి అన్నారు. గురువారం పెనపహాడ్‌ మండలం పొట్లపహాడ్‌ గ్రామంలో ఆయన పర్యటించారు. కల్తీ విత్తనాలతో దెబ్బతిన్న గ్రామానికి చెందిన రైతు గజ్జి వెంకన్నకు చెందిన ఆరు ఎకరాల పొలాన్ని కోదండరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని ఓ దుకాణంలో వరి విత్తనాలు కొనుగోలు చేసినట్లు రైతు వివరించారు. నెల రోజులకే పొలమంతా ఈని, కంకితో నిలబడిపోవడంతో భారీనష్టం జరిగినట్లు రైతు తెలిపారు. అదేవిధంగా మాచారం, న్యూబంజారాహిల్స్‌తండారైతులు కూడా నకిలీ విత్తనాలతో నష్టపోయినట్లు కోదండరెడ్డికి మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ రైతులు పంట నష్టపోవడానికి కారకులైన వారిని ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. రాష్ట్రంలో కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతుల నుంచి ఫిర్యాదులు తీసుకుని నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తానని అన్నారు. కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిటీ సభ్యులు రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, చెవిటి వెంకన్నయాదవ్‌, మరికంఠ భవానీరెడ్డి, భూమి సునీల్‌, వ్యవసాయ కమిషన అధికారి హరివెంకటప్రసాద్‌, డీఏవో శ్రీధర్‌రెడ్డి, ఏడీఏ రవి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు తూముల సురే్‌షరావు, నాయకులు భూక్యా శివనాయక్‌, భూక్యా సందీ్‌పరాథోడ్‌, ఆర్తీ కేశవులు, పిన్నాని కోటేశ్వర్‌రావు, నారాయణ ప్రవీణ్‌రెడ్డి, అంజద్‌అలీ, కక్కిరేణి శ్రీనివాస్‌, చింతమల్ల రమేష్‌, కోడి కుమార్‌యాదవ్‌ పాల్గొన్నారు.

అనుమతి ఉన్న కంపెనీల విత్తనాలే విక్రయించాలి

సూర్యాపేట(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అనుమతి ఉన్న కంపెనీలు, డీలర్లు మాత్రమే విత్తనాలు విక్రయించాలని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన చైర్మన కోదండరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌తో కలిసి గురువారం సమావేశమ య్యారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని వివరించారు. అనంతరం కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ మాట్లాడుతూ విత్తనాల శాంపిల్స్‌ సేకరించి పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో కమిషన సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 12:35 AM