Share News

పీఏసీఎస్‌ పాలకవర్గాల గడువు మరో ఆరు నెలలు పొడిగింపు

ABN , Publish Date - Feb 15 , 2025 | 01:00 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల గడువు శుక్రవారంతో ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

పీఏసీఎస్‌ పాలకవర్గాల గడువు మరో ఆరు నెలలు పొడిగింపు

నల్లగొండ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల గడువు శుక్రవారంతో ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 108 సహకార సంఘాలు ఉన్నాయి. పాలకవర్గాల గడువు ముగియడానికి ముందే రాష్ట్రంలోని అన్ని డీసీసీబీల చైర్మన్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సొసైటీలు, సహకార బ్యాంకుల అభివృద్ధి కోసం మరికొంత కాలం పాటు పాలకవర్గాల గడువు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలను జూన్‌ వరకు వాయిదా వేసిన నేపథ్యంలో ఇప్పట్లో సహకార సంఘ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల పాటు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. పాలకవర్గాల గడువు పెంచినందుకు డీసీసీబీ చైర్మన్‌ కుంభం శ్రీనివా్‌సరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, తుమ్మల నాగేశ్వర్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. పీఏసీఎ్‌సల పాలకవర్గం గడువు, డీసీసీబీల పాలకవర్గం పొడిగింపుతో బ్యాంకుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 01:00 AM