ఆరుట్ల దంపతుల పోరాటం నేటి తరానికి స్ఫూర్తి
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:38 AM
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆలేరు ప్రాంతం నుం చి ఆరుట్ల దంపతులు చూపిన తెగువ నేటితరానికి ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుందని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.సాంబశివరావు అన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు
ఆలేరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆలేరు ప్రాంతం నుం చి ఆరుట్ల దంపతులు చూపిన తెగువ నేటితరానికి ఎంతో స్ఫూర్తిని కలిగిస్తుందని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.సాంబశివరావు అన్నారు. డాక్టర్ ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలేరు హైస్కూల్ క్రీడా మైదానంలో సోమవారంనుంచి చేపడుతున్న ఆరుట్ల దంపతుల స్మారక క్రీడోత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. ముందుగా ఆరుట్ల దంపతుల చిత్రపటాలకు పూలమాలవేసి జ్యోతి వెలిగించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అనేక ఉద్యమాలకు నిలయమన్నారు. విద్యార్థు లు చదువుతోపాటు సమాజాన్ని అధ్యయనం చేస్తూ ముందుకు సాగాలన్నారు. ఆరుట్ల వారసులుగా కోడలు సుశీలాదేవి, మనుమలు ప్రశాంత్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, మనుమరాలు మమత కొనసాగిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఐజీ రమేష్ మాట్లాడుతూ మానసిక వికాసం కోసం చదువు, శారీరక ధృడత్వం కోసం క్రీడలు అలవర్చుకోవాలన్నారు. నియోజవర్గస్థాయిలో ఈ నెల 8 తేదీ వరకు నిర్వహిస్తున్న పోటీలకు ప్రభుత్వ, ప్రైవేట్ పా ఠశాలల నుంచి 70జట్లు హాజరయ్యాయి. కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్‌వంటి పలు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ప్రముఖ సాహితీవే త్త ఉపాధ్యాయుడు డాక్టర్ పోరెడ్డి రంగయ్య, క్రీడల కన్వీనర్ హైస్కూల్ హెడ్‌మాస్టర్ దాసరి మంజుల, మునిసిపల్ చైర్మన్ శంకరయ్య, వైస్ చైర్మన్ మాధవి, వెంకటేష్, మండల విద్యాధికారి లక్ష్మి, సీపీఐ జిల్లా కా ర్యదర్శి గోదా శ్రీరాములు, జిల్లా కమిటీ సభ్యులు కళ్లెం కృష్ణ, చెక్క వెంకటేశం, కట్కూరి సుశీలా రామచంద్రరెడ్డి ఫౌండేషన్ నుంచి రామ్‌గోపాల్‌రెడ్డి, మాధవరెడ్డి, విద్యావేత్త విరువంటి గోపాలకృష్ణ, క్రీడల కో కన్వీనర్ బాలకృష్ణ, పూల నాగయ్య, గడసంతల మధుసూధన్, తునికి విజయసాగర్, మాదాని జోసఫ్, వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినుల నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
భూమికోసం, భుక్తికోసం, వెట్టి నుంచి విముక్తికోసం..
భూమికోసం, భుక్తికోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తికోసం కట్కూరి సుశీలదేవి-రామచంద్రారెడ్డి చేసిన పోరాటం అద్వితీయమని సాంబశివరావు అన్నారు. దివంగత ఎమ్మెల్యే కట్కూరి రామచంద్రారెడ్డి వర్దంతి సందర్భంగా సోమవారం ఆలేరు పట్టణంలోని స్వాతంత్య్ర సమరయోధులు కట్కూరి రామచంద్రారెడ్డి సుశీలాదేవి దంపతుల విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.