షెడ్యూల్ రావడమే తరువాయి
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:34 AM
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చి నా నిర్వహించేందుకు నల్లగొండ జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అవసరమైన అన్నిఏర్పాట్లను చకచకా చేస్తున్నారు.

పంచాయతీ ఎన్నికలకు ముమ్మరంగా ఏర్పాట్లు
ఇప్పటికే తుదిఓటరు జాబితా సిద్ధం
కొనసాగుతున్న బ్యాలెట్ పేపర్ల పరిశీలన
- (ఆంధ్రజ్యోతి, నల్లగొడ టౌన)
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చి నా నిర్వహించేందుకు నల్లగొండ జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అవసరమైన అన్నిఏర్పాట్లను చకచకా చేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల కోసం తుదిఓట రు జాబితాను సిద్ధం చేసిన అధికార యంత్రాం గం ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన ఏర్పాట్లను గడిచిన మూడు నాలుగు నెలలుగా చేపడుతోంది. బ్యాలెట్ పెట్టెలకు మరమ్మతులు చేసి గోదాంలో భద్రపరిచారు. తాజాగా బ్యాలె ట్ పేపర్ల ముద్రణ పూర్తయి జిల్లాకు చేరుకున్న బ్యాలెట్ పత్రాల కౌంటింగ్, పరిశీలన ప్రక్రియ ను చేపట్టారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు నల్లగొం డ జిల్లాలో ఇటీవల ఏర్పడిన నూతన మండలాలతో పాటు కొత్తగా ఏర్పాటుకానున్న వాటితో కలిపి 33 మం డలాల్లోని 868 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో జిల్లాలో 31 మం డలాలు 844 గ్రామపంచాయతీలుండగా వాటి సంఖ్య ప్రస్తుతం పెరిగింది. ఈ మేరకు ఆ దిశగా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.ఇందులో భాగంగా ఇప్పటికే తుది ఓటరు జాబితాను సైతం సిద్ధం చేశారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 10 లక్షల 56 వేల ఓటర్లు ఉండగా జిల్లా వ్యాప్తంగా 7,392 పోలింగ్ బూ తలను గుర్తించారు. దీనికి తోడు పోలింగ్ సిబ్బంది వివరాలను సైతం సేకరించి పోలింగ్ కేంద్రాల వారీగా తయారుచేస్తున్నారు.
జిల్లాకు చేరిన ఎన్నికల సామగ్రి
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అవసరమైన ఎన్నికల సామగ్రి ఇప్పటికే జిల్లాకు చేరింది. బ్యాలెట్ పత్రాలు సైతం జిల్లాకు చేరుకోగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని గోదాముల్లో వీటిని భద్రపరిచారు. గ్రామ సర్పంచ, వార్డు మెంబర్లు సంబంధించి రెండు వేర్వేరు రంగుల్లో వీటిని ముద్రించారు. సర్పంచ ఎన్నికలకు గులాబి రంగు బ్యాలెట్‌ను, వార్డు మెంబర్‌కు తెలపురంగులో ముద్రించి బ్యాలెట్‌ను ముద్రించారు. ఎన్నికల కమిషన ఆదేశానుసారం ఈసారి సర్పంచ అభ్యర్థులకు 30 రకాల గుర్తులను, వార్డు మెంబర్లకు 20 రకాల గుర్తులను సిద్ధం చేశారు. సర్పంచలుగా పోటీ చేసేవారికి ఉంగరం, కత్తెర, ఫుట్‌బాల్, బ్యాట్, బాట్‌మెన, స్టంప్స్, టీవీ రిమోట్, టూతపే్‌స్ట వంటివి ఉన్నాయి. వార్డు సభ్యులకు పొయ్యి, స్టూల్, బీరువా, గ్యాస్ సిలెండర్, గౌను, ఈల, కుండ వంటి గుర్తులను కేటాయించనున్నారు. మొత్తం 25 లక్షలకు పైగా బ్యాలెట్ పత్రాలు జిల్లాకు చేరుకోగా వాటిల్లో గుర్తులు, బండిల్స్ లెక్కించే పనిలో జిల్లా పంచాయతి అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
గోదాముల్లో బ్యాలెట్ బాక్సులు నిక్షిప్తం
పంచాయతీ పోరుకు సంబంధించి అవసరమైన బ్యాలెట్ బాక్సులు ఇప్పటికే జిల్లాకు చేరాయి. ఇటివల రైల్వే డిపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన డివిజన ఎన్నికల్లో వినియోగించిన బ్యాలెట్ బాక్సులను ఎన్నికల కమిషన ఆదేశానుసారం వివిద డివిజన్ల నుంచి జిల్లాకు తెప్పించి నోడల్ అధికారుల సమక్షంలో చిన్నచిన్న మరమ్మతులుంటే సరిచేసి కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదాంలలో భద్రపరిచారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో వసతులపై కూడా ఎప్పటికప్పడు ఆరా తీస్తున్నారు. అధికారులు శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు వినియోగించిన పోలింగ్ కేంద్రాల్లోనే తాగునీరు, ప్రహరీ, విద్యుత, ఫ్యాన్లు, ర్యాంపులు ఇతర మౌలిక వసతులు తనిఖీ చేస్తూనే సమస్యలు తెలుసుకుంటున్నారు.
ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం
జిల్లాలో ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలతో పోలింగ్ కేంద్రాలను పరిశీలించాం. బ్యాలెట్ పెట్టెలకు మరమ్మతులు చేశాం. సర్పంచ, వార్డు సభ్యులకు అవసరమైన బ్యాలెట్ పేపర్లు ముద్రించడమే కాకుండా వాటిని పరిశీలించే కార్యక్రమం కొనసాగుతోంది.
-వెంకయ్య, నల్లగొండ జిల్లా పంచాయతీ అధికారి