కన్నీరు పెట్టిస్తున్న మిర్చి
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:10 AM
(ఆంధ్రజ్యోతి - హుజూర్‌నగర్) జిల్లాలో మిర్చి పంట రైతుల కంట కన్నీరు పెట్టిస్తుంది. పంటలకు తెగుళ్లు సోకడంతో పంట దిగుబడి భారీగా తగ్గిపోయింది.

(ఆంధ్రజ్యోతి - హుజూర్‌నగర్) జిల్లాలో మిర్చి పంట రైతుల కంట కన్నీరు పెట్టిస్తుంది. పంటలకు తెగుళ్లు సోకడంతో పంట దిగుబడి భారీగా తగ్గిపోయింది. జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలలోని అనేక గ్రామాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. కాగా మిర్చికి తెగుళ్లు సోకడంతో పూర్తిస్ధాయిలో దిగుబడి తగ్గిపోయింది. మిర్చిపంట దేఽశవాళి రకానికి ఎకరానికి 4 క్వింటాళ్లు కూడా దిగుబడి రావడం లేదని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా సీడ్ రకానికి మాత్రం 12 నుంచి 18 క్వింటాళ్లు దిగుబడి వస్తున్నట్లు మిర్చి రైతులు పేర్కొంటున్నారు. కాగా జనవరి నుంచి మిర్చిపంట పూత దశకు చేరుకుంది. దేశవాళి రకం మిర్చిపంట నల్లి, వైరస్(బొబ్బర) వ్యాధి సోకింది. మొత్తం ఎకరానికి కనీసం 20 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా కనీసం 5 క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదని జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మిర్చి దేశవాళీ రకం పూర్తిస్ధాయిలో దెబ్బతినడం వలన రైతులు ఒక్కసారిగా అప్పుల ఊబిలో కూరుకపోయారు.
గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు
కాగాజనవరి నుంచి మిర్చి కోస్తున్న రైతులకు గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్వింటా మిర్చి రూ. 10 నుంచి 12వేల మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. 40 శాతం మంది రైతులు ఏసీ గోదాములకు తరలిస్తుండగా 60 శాతం మంది రైతులు మధ్య దళారీలకు విక్రయిస్తున్నారు. వాస్తవంగా మిర్చి రైతులకు క్వింటా రూ.20వేలు మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. కానీ ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో మిర్చిపంటను సగం ధర కూడా రావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలో మిర్చిపంట 2023-24లో 19,284 ఎకరాల్లో సాగు చేయగా దానితో పాటు పత్తిపంట 88,869 ఎకరాలలో సాగు చేశారు. అదే విధంగా 2024-25లో పత్తి 88,314 ఎకరాల్లో సాగు చేయగా మిర్చి 14,915 ఎకరాల్లో సాగు చేశారు. హుజూర్‌నగర్ డివిజన్‌లో 10,354 ఎకరాల్లో మిర్చి సాగు చేయగా పత్తిపంట 25,921 ఎకరాలలో సాగు చేశారు. చింతలపాలెంలో 7,123 ఎకరాల్లో, మఠంపల్లిలో 2,336, మేళ్లచెరువు 860, పాలకీవీడులో 32 ఎకరాల్లో మిర్చి వేశారు. జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల్లో సైతం మిర్చిపంటను పెద్ద మొత్తంలో సాగు చేయడం గమనార్హం. కాగా మార్కెట్‌లో అక్కడక్కడ మిర్చి సుమారు క్వింటా రూ. 13వేలకు కొనుగోలు చేస్తుండగా 80 శాతం మిర్చిని 12వేల లోపే కొనుగోలు చేస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలోని కృష్ణా పరీవాహక ప్రాంతం దొండపాడు, చింతలాపాలెం, గుడిమల్కాపురం ప్రాంతాలలో ఏసీ గోదాములు ఉండగా రైతు లు 30శాతం మంది నిల్వ చేస్తున్నారు. 70 శాతం మంది రైతులు తెలంగాణ ప్రాంతంలోని హుజూర్‌నగర్, కోదాడ డివిజన్‌ల్లో మిర్చిపంటను సాగు చేసిన రైతులు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, పల్నాడు జిల్లాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. తెలంగాణ నుంచి వచ్చే రైతులకు క్వింటాకు రూ. 1000 నుంచి 2000ల వరకు అదనంగా గిట్టుబాటు లభిస్తుందని రైతులు పేర్కొంటున్నారు. కాగా రైతులు పండించిన పంట మొత్తం ఇంటికి వచ్చేసమయానికి ధర లేకపోవడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు.
రోజు కూలి రూ.200 మాత్రమే
సూర్యాపేట జిల్లాలో హుజూర్‌నగర్ డివిజన్‌లో మిర్చి అధికంగా చింతలపాలెం మండలంలో సాగు చేయగా మిర్చిని కోసేందుకు అక్కడి రైతులు హుజూర్‌నగర్, గరిడేపల్లి, నేరేడుచర్ల మండలాలకు చెందిన వేలాది మంది కూలీలు ప్రతిరోజు ట్రాక్టర్లు, ఆటోలపై చింతలపాలెం ప్రాంతాలకు వెళ్తు న్నా రు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5గంటల వరకు పంటలు కోస్తు న్నారు. కాగా వారికి ప్రతిరోజు కూలి కేవలం రూ. 200 మాత్రమే లభిస్తుంది .ఆటో లేదా ట్రాక్టర్ పై వెళ్లి వచ్చేందుకు కొంతమంది రైతులు ప్రతిరోజు రూ.50 అదనంగా చెల్లిస్తునానరు మొత్తంగా చూస్తే రూ.250 కూలి మాత్ర మే గిట్టు బాటు అవుతుంది. కాగా పంటల దిగుబడి తగ్గిన నేపథ్యంలో కూలి రేట్లు కూడా తక్కువగా ఇస్తున్నట్లు కూలీలు పేర్కొంటున్నారు.