ప్రభుత్వం మారాలనేది ప్రజల కోరిక
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:45 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మారాలనేది ప్రజల కోరిక అని మాజీమంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

అశాస్ర్తీయంగా కులగణనతో 20లక్షల జనాభా తగ్గింపు
సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి జగదీ్‌షరెడ్డి
హుజూర్‌నగర్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మారాలనేది ప్రజల కోరిక అని మాజీమంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మండలంలోని వేపలసింగారంలో మాజీ సర్పంచ్ అన్నెం శిరీషకొండారెడ్డి గ్రామ ప్రజలకు ఉచిత సేవలు అందించేందుకు రూ.3లక్షలతో కొనుగోలుచేసిన అంబులెన్స్‌ను ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 15నెలల కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వం మూర్ఖంగా, అశాస్ర్తీయమైన పద్ధతిలో తెలంగాణలో కులగణన చేసిందన్నారు. 20లక్షల మంది జనాభాను తక్కువ చూపెట్టిందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కులగణన పేరుతో రాష్ర్టానికి ద్రోహం చేశారన్నారు. జనాభాను పెంచి నియోజకవర్గాలను పెంచుకోవాల్సి ఉండగా, తక్కువ చేసి చూపించడం వల్ల డీలిమిటేషన్‌లో అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. కులగణన సందర్భంగా స్వయంగా మంత్రులే సర్వేకు వెళ్ళిన అధికారులపై కుక్కలను వదులుతున్నారని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సర్వేలో 75 అంశాల ప్రశ్నలను ఎందుకు అడిగారన్నారు. సీఎం మూర్ఖత్వంతో రాష్ట్రం పరువు పోయిందన్నారు. మరోసారి సమగ్ర సర్వే చేయాలన్నారు. ఈ నెల 19న హైద్రాబాద్‌లో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ సమావేశంలో 15 నెలల కాంగ్రెస్ పాలనపై సమరశంఖం పూరిస్తామన్నారు. పార్టీ నేతలకు కేసీఆర్ దిశ, నిర్ధేశం చేయనున్నారని తెలిపారు. రైతులు, సమాజానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేసిన శిరీషకొండారెడ్డి దంపతులను మాజీ మంత్రి జగదీ్‌షరెడ్డి అభినందించారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉచిత అంబులెన్స్ సేవలు అందించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, కొప్పుల సైదిరెడ్డి, రెక్కల శంభిరెడ్డి, సారెడ్డి భాస్కర్‌రెడ్డి, హరిలీల, బ్రహ్మారెడ్డి, నందిరెడ్డి సైదిరెడ్డి, కోటిరెడ్డి అమర్‌గౌడ్, రాంబాబుముదిరాజ్, జక్కుల నాగేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, రాజమోహన్‌రెడ్డి, బిక్ష్మారెడ్డి,, శంకర్, పిచ్చిరెడ్డి, జోజిరెడ్డి, మర్రెడ్డి పాల్గొన్నారు.