ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి
ABN , Publish Date - Feb 10 , 2025 | 12:38 AM
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు
చౌటుప్పల్ టౌన్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. ఆదివారం హైదరాబాద్‌నుంచి నల్లగొండకు వెళుతున్న మంత్రి సంజయ్‌కుమార్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డిలకు చౌటుప్పల్‌లో ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ధిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి మిఠాయిలు తినిపించారు. హైవేపై బాణాసంచా కాల్చారు. ఈ సందర్బంగా కార్యకర్తలకు మంత్రి పలు సూచనలు చేశారు. ధిల్లీ విజయాన్ని ప్రేరణగా తీసుకోవాలన్నారు. తదుపరి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. తెలంగాణలో ఎన్నికల హామీలను అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకావాలన్నారు. పార్టీ బలోపేతంపై నూతన కమిటీలు దృష్టి సారించాలన్నారు. మండల పరిధిలోని అంకిరెడ్డిగూడేనికి చెందిన బీఆర్‌ఎస్ నేత పర్నే సంతో్‌షరెడ్డి అనుచరులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు. కార్యక్రమంలో బీజేపీ మునుగోడు అసెంబ్లీ ఇన్‌చార్జి దూడల భిక్షంగౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, పట్టణ, మండల అధ్యక్షులు కడారి కల్పన, కె.అశోక్, నాయకులు ముత్యాల భూపాల్ రెడ్డి, బి.సత్యం, బత్తుల జంగయ్య, జి.సురేందర్‌రెడ్డి, కె.గోవర్థన్‌రెడ్డి, పి.శ్రీధర్‌బాబు, ఆలె చిరంజీవి, పబ్బు వంశీ, దిండు భాస్కర్, ఆర్.సత్తయ్య, జి.పురుషోత్తం పాల్గొన్నారు.