అర్హులందరికీ పథకాలు అందించడమే లక్ష్యం
ABN , Publish Date - Jan 28 , 2025 | 12:39 AM
అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు.
ఆలేరు, జనవరి 27(ఆంధ్రజ్యోతి): అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. సోమవారం ఆలేరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 8మండలాలకు ప్రభుత్వం విడుదల చేసిన సీఎంఆర్‌ఎఫ్ , కల్యాణ లక్ష్మీ చెక్కులనులబ్దిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం రేవంతరెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన కార్డు, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగుతాయని అన్నారు. ఈ విషయంలో లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 220మందికి సీఎంఆర్‌ఎఫ్, 121మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు కె.వెంకటేశ్వర రాజు, ఎజాజ్, వర్కింట్ ప్రెసిడెంట్ ముదిగొండ శ్రీకాంత, నాయకులు నీలం పద్మ వెంకటస్వామి, సత్యం, ఎగ్గిడి యాదగిరి, కె.సాగర్‌రెడ్డి, శమంతారెడ్డి, చింతల ఫణి సునీతా శ్రీనివాస్ రెడ్డి, తుంగ కుమార్, పిక్క శ్రీనివాస్ పాల్గొన్నారు.